Dr నండూరి రామక్రిష్ణ
22.03.2026.
ఊరి కొక్కడు.
పుట్టుకొస్తున్నాడు
కల్తీ రాయుడు, నేడు, వస్తువు
గిరాకీ ని బట్టి.
కల్తీ కి కాదేది
అనర్హం అన్న
చందాన, కల్తీ కి
ఉపక్రమిస్తున్నారు.
నగరాల్లో ఐతే
ఇంకా యదేచ్చగా
కల్తీలు కొనసాగుతున్నాయి
వ్యవస్థలు ఎన్ని
ఉన్నా, ప్రజానీకం
అవస్థల పాలవ్వడం
తప్పడం లేదు.
కల్తీ లేని తిను
బండారo నేడు
కానరాదు,
కొందామన్నా,
తిoదామన్నా!
ఎన్ని చట్టాలు ఉన్నా
అవి లోప భూఇష్టం.
అంతటా అవినీతి
మయం. భయం
లేదు, నేరగాళ్లకు.
ఏ నేరం చేసి
దొరికినా 24 గం :
లోపు బైలు
తెచ్చుకొని
{బైలు కొనుక్కుని}
బయట పడ వచ్చు
నన్న ధీమా.
నేరగాళ్లకు
అభయ హస్తాలు
కొంత మంది
న్యాయ వాదుల
అండదండలు.
ఇక పోలీసు
వ్యవస్థ, వారి
పరిధి కాదంటారు.
వంటకు వాడే
నిత్యావసరాలాన్ని
కల్తీ, పంట కోసం
నాటే విత్తనాలు
కల్తీ, మనిషి కల్తీ,
ఆతని మాట కల్తీ,
పాలు కల్తీ,
పాలన కల్తీ,
విద్య కల్తీ,
వైద్యం కల్తీ,
కూడు కల్తీ,
గూడు కల్తీ,
కల్తీ లేని
సమాజాన్ని
చూడలేం,
రెండు కళ్ళు
ఉన్నా!
కల్తీ లకు
దోహదకారి
మనిషే.
ధన దాహం,
అధికార దాహం,
పదవీ వ్యామొహం,
వెరసి కల్తీలకు
కారకం, ప్రేరకం
మనిషే.
నదులనీ
వదలడు,
ప్రకృతిని
పరిరక్షించడు,
చివరకు
సాగ్గరాన్ని
వదలడు.
నిలువెత్తు
స్వార్ధం
మనిషికి
తప్ప వేరే
ప్రానికి లేదు.
కల్తీ కారకుని
కట్టినంగా
శిక్షించాలి.
కాలో, చెయ్యొ
తీసి మళ్ళీ
కల్తీకి పాల్పడ
కుండా చెయ్యాలి.
తగిన చట్టాల్ని
తీసుకు రావాలి.
అప్పుడే ఈ
సమాజాన్ని
కల్తీల బారి నుండి
కాపాడగలం.
రాజకీయ దన్ను
తోనే కల్తీ లకు
పాల్పడతారు.
ప్రజారోగ్యం తో
ఆటలు వారికి
పరిపాటి.
దీనికి అంతం
లేదు.
కల్తీ ని సేవించి
అనారోగ్యం కు
గురై, తనువు
చాలించ
వలసినదేనా
నివృత్తి అంటూ
లేక విధి విలాపం
అని సర్దుకు
పోవాలా!
పాలకులు
చర్యలు
గైకొనాలేరా!
విధి వ్రాత ఇంతే
అని సర్దుకు
పోవాలా!

Comments
Post a Comment