19న ముఖ్యమంత్రి చేతులు మీదుగా స్వీకరణ*(విశాఖసిటీ-మార్చ్ 17)సీనియర్ పాత్రికేయులు.. జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టులు ఫెడరేషన్ నాయకులు గంట్ల శ్రీనుబాబుకు రాష్ట్రప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకమైన పరాభవనామ ఉగాది పురస్కారం ప్రకటించింది. జర్నలిజం, సేవా రంగంలో ఆయన చేస్తున్న విశేష సేవలను గుర్తించి ఈ పురస్కారాన్ని అందజేస్తున్నట్లు ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు జీవోనెంబర్ 27ను రాష్ట్రప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్ మంగళవారం సాయంత్రం విడుదల చేశారు. ఉగాది పర్వదినం సందర్భంగా గురువారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ర ్ట ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి కందుల దుర్గేష్, ఇతర ప్రముఖులు చేతులు మీదుగా గంట్ల శ్రీనుబాబు ఈ అవార్డును స్వీకరించనున్నారు. ఇప్పటికే అనేక జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయి పురస్కారాలు గంట్ల శ్రీనుబాబు స్వీకరించారు. మూడు దశాబ్దాలుగా గంట్ల శ్రీనుబాబు జర్నలిజంలో కొనసాగుతూ జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేయడంతో పాటు అనేక దేవాలయాలకు గౌరవ అధ్యక్షుడిగా, డాక్‌యార్డు కేటిబి అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడిగా,విశాఖ కళాకారుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులుగా కొనసాగుతూ ఇంకా అనేక సంస్థలకు సలహాదారుడిగా కొనసాగుతూ త న సేవలు అంది స్తున్నారు. ఈ మేరకు రాష్ట్రప్రభుత్వ పురస్కారం లభించడంతో గంట్లశ్రీనుబాబును పలువురు జర్నలిస్టులు అభినందించారు.
మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు
మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...

Comments
Post a Comment