Skip to main content

జీవీఎంసీ కమిషనర్ ను కలిసిన బళ్లారి సిటీ కార్పొరేషన్ మేయర్ పి. గాదెప్ప *విశాఖ నగరంలో చేపట్టిన ప్రాజెక్టులు ,అభివృద్ధి కార్యక్రమాలను వివరించిన జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్. *విశాఖ నగర సుందరీకరణ, అభివృద్ధి ఇతర నగరాలకు ఆదర్శంగా నిలుస్తూ స్ఫూర్తిని కలిగిస్తోందన్న బళ్లారి మేయర్.

 

విశాఖపట్నం, మార్చి 27:  అధ్యయన యాత్రపై విశాఖ నగరానికి విచ్చేసిన బళ్లారి సిటీ కార్పొరేషన్ మేయర్ పి.గాదెప్ప ,బళ్లారి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్  జె. ఎస్. ఆంజనేయులు, బళ్లారి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మెంబర్ రంజిత్ కుమార్ లతో కలసి శుక్రవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయం కమిషనర్ ఛాంబర్ లో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ను మర్యాదపూర్వకంగా కలిసి విశాఖ నగర సుందరీకరణ ,అభివృద్ధి కార్యక్రమాలు ఆకట్టుకుంటూ ఇతర నగరాలకు ఆదర్శంగా నిలుస్తూ స్ఫూర్తిని కలిగిస్తుందని ప్రశంసలను వ్యక్తం చేస్తూ అభినందనలను తెలిపారు.

ఈ సందర్భంగా జీవీఎంసీ కమిషనర్  బళ్లారి మేయర్ మాట్లాడుతూ విశాఖ నగర అభివృద్ధి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వా సంక్షేమ పథకాలు నిర్వహణ, నగర సుందరీకరణ పై నిత్యం చేపడుతున్న కార్యాచరణను బళ్లారి మేయర్ కు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్డి సిస్టం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ప్రతి సోమవారం నిర్వహిస్తూ ప్రజల సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని, అలాగే జీవీఎంసీ సిటీ ఆపరేషన్స్ సెంటర్ ద్వారా ఐ వి ఆర్ ఎస్, టోల్ ఫ్రీ నెంబర్ 1800 4250 0009 ప్రజా ఫిర్యాదులను స్వీకరించడం, వాటి పరిష్కారం పై సంబంధిత విభాగాలకు సమాచారం చేరవేసినిర్ణీత సమయంలో ఆయా సమస్యలు పరిష్కరించే కార్యక్రమం  జీవీఎంసీ నిత్యం జరుపుతుందన్నారు.  విశాఖ నగరంలో వాహనాల రాకపోకలకు సౌకర్యంగా ట్రాఫిక్ రద్దీని అరికట్టేందుకు, ప్రజలకు వాహనాల పార్కింగ్ సౌకర్యం కల్పించేందుకు, జీవీఎంసీ పరిధిలో పార్కులు ప్రభుత్వ స్థలాలను ఆక్రమణలకు గురికాకుండా రక్షణ కల్పించే దిశగా జీవీఎంసీ వినూత్నంగా ఆపరేషన్ లంగ్స్ (లైఫ్ టు అర్బన్ గ్రీన్ స్పేసెస్) 1,2,3 లను దశలవారీగా చేపట్టడం జరిగిందన్నారు. ప్రజలకు అందించే నీటి సరఫరా 24/7 వాటర్ సప్లై నిర్వహణను వివరించారు. నగరంలో ఎస్టీలను నిర్వహిస్తూ నీటిని శుద్ధి చేసి పరిశ్రమలకు సరఫరా చేయడం ద్వారా జీవీఎంసీకి ఆదాయం చేకూరుతుందన్నారు. జీవీఎంసీ ఆస్తులను గుర్తించి ఆయా ప్రదేశాలలో పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయడం ద్వారా జీవిఎంసీ ఆదాయాన్ని చేకూర్చుకుంటుందన్నారు. వీధిలైట్లు నిర్వహణ ద్వారా నగర సుందరీకరణ , సోలార్ ప్లాంట్లు నిర్వహణ, రోడ్లు విస్తరణ, జంక్షన్లో అభివృద్ధిని వివరించారు. నగరంలో అన్ని మౌలిక సదుపాయాలతో ప్రజలకు అందుబాటులో ఉండేలా, వీధి విక్రయదారులను గుర్తించి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేలా జీవీఎంసీ వినూత్నంగా స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ జోన్లను నగరంలో ఏర్పాటు చేస్తుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు అందజేయడంలో జీవీఎంసీ ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందన్నారు. అనంతరం బళ్లారి మేయర్  పి గాదెప్ప మాట్లాడుతూ విశాఖ నగరానికి అధ్యయన యాత్రకు విచ్చేయడం జరిగిందని, గురువారం వి ఏం ఆర్ డి ఏ చైర్మన్ ను కలిసి విఎమ్ఆర్డిఏ ద్వారా నగరంలో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నామన్నారు. విశాఖ నగర సుందరీకరణ, అభివృద్ధి చాలా ఆకర్షణీయంగా ఉందని జీవీఎంసీ కార్యాచరణ ఇతర నగరాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. త్వరలో బళ్లారి సిటీ కార్పొరేషన్ నుండి విశాఖ నగర అభివృద్ధి కార్యక్రమాలపై అధ్యయనం చేసేందుకుగాను ప్రత్యేకమైన సాంకేతిక బృందాన్ని విశాఖ నగరానికి పంపిస్తామని, జీవీఎంసీ చేపట్టి ఆచరిస్తున్న అభివృద్ధి, ప్రజా సంక్షేమం, నగర సుందరీ కరణ  తదితర అంశాలను బళ్లారి సిటీ కార్పొరేషన్ సాంకేతిక బృందానికి వివరించేలా జీవీఎంసీ సహాయ సహకారాలు అందించాలని జీవీఎంసీ కమిషనర్ ను ఈ సందర్భంగా బళ్ళారి మేయర్ పి. గాదెప్ప కోరారు.


ఈ కార్యక్రమంలో బళ్లారి సిటీ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారి తిప్పేస్వామి పాల్గొన్నారు.


పౌర సంబంధాల అధికారి ,

జివిఎంసి

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...