Skip to main content

తిరుపతిలో వైఎస్సార్సీపీ మహిళా నేతలపై జరిగిన అమానుష దాడికి నిరసనగా అమలాపురంలో భారీ ప్రదర్శన...

అమలాపురం, విశాఖ సందేసం.తిరుపతి గ్రాండ్ రిడ్జ్ హోటల్ వద్ద టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు రాజీనామా డిమాండ్‌తో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వైఎస్సార్సీపీ మహిళా నేతలపై జరిగిన అమానుష దాడిని నిరసిస్తూ, నేడు అమలాపురంలో వైఎస్సార్సీపీ శ్రేణులు భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు . పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గరెడ్డి, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వ నిరంకుశత్వం: శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును కాలరాస్తూ మహిళా నేతలపై భౌతిక దాడులకు దిగడం హేయమైన చర్య అని నాయకులు ధ్వజమెత్తారు. దాడికి గురైన బాధితులపైనే తిరిగి తప్పుడు కేసులు పెట్టడం ప్రభుత్వ అప్రజాస్వామిక పాలనకు నిదర్శనమని విమర్శించారు.

మహిళా నేతల ఆగ్రహం: మాజీ ఎంపీ చింతా అనురాధ, మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళా నాయకులకు రక్షణ కరువైందని, తప్పుడు కేసులు పెట్టి భయపెట్టాలని చూడటం సాధ్యం కాదని హెచ్చరించారు.మహిళా నేతలపై దాడికి పాల్పడిన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని, బనాయించిన తప్పుడు కేసులను ఉపసంహరించుకోవాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. ఈ నిరసన కార్యక్రమంలో చిర్ల జగ్గరెడ్డి, తోట త్రిమూర్తులు, మాజీ ఎంపీ చింత అనురాధ,పినిపే శ్రీకాంత్, పార్టీ వివిధ అనుబంధ విభాగాల అధ్యక్షులు, కౌన్సిలర్లు, మరియు భారీ సంఖ్యలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. పట్టణ ప్రధాన వీధుల గుండా నిరసన ర్యాలీ నిర్వహిస్తూ ప్రభుత్వం మరియు టీటీడీ చైర్మన్ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...