జీవీఎంసీ స్థాయి సంఘంలో అభివృద్ధి పనులకు ఆమోదం. -విశాఖ నగర మేయర్, స్థాయి సంఘం చైర్ పర్సన్ పీలా శ్రీనివాసరావు.
నగరపాలక సంస్థ స్థాయి సంఘం సమావేశంలో పలు అభివృద్ధి పనులకు సభ్యులు ఆమోదం తెలిపారని నగర మేయర్, స్థాయి సంఘం చైర్ పర్సన్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని సమావేశ మందిరంలో అందరూ స్థాయి సభ్యులతో, జీవీఎంసీ అధికారులతో కలిసి స్థాయి సంఘo సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా స్థాయి సంఘం చైర్ పర్సన్ మాట్లాడుతూ స్థాయి సంఘం సమావేశంలో ప్రధాన ఎజెండాలో 193 అంశాలు, 101 టేబుల్ అజెండా అంశాలతో పాటు మొత్తం 294 అంశాలు పొందుపరచగా, వాటిని స్థాయి సంఘం సభ్యులు క్షుణ్ణంగా చర్చించి ప్రధాన అజెండాలోని అన్ని అంశాలను ఆమోదించడం జరిగిందని, టేబుల్ అజెండాలో 101 అంశాలలో ఒక అంశం వాయిదా వేయగా మిగిలినవి ఆమోదించడం జరిగిందని మొత్తంగా 294 అంశాలలో 293 అంశాలకు సభ్యులు ఆమోదం తెలిపారని స్థాయి సంఘం చైర్పర్సన్ తెలిపారు.
అనంతరం స్థాయి సంఘం చైర్ పర్సన్ మాట్లాడుతూ మేయర్ గా , స్టాండింగ్ కమిటీ చైర్ పర్సన్ గా తను పదవిని చేపట్టిన నాటి నుండి విశాఖ నగర అభివృద్ధి దిశగా, అన్ని వార్డులలో ప్రజలకు కల్పించవలసిన మౌలిక వసతులు, రోడ్లు,కాలువలు, ఫుట్ పాతులు నిర్మాణాలు, మరమ్మత్తులు తదితర అభివృద్ధి పనులను కౌన్సిల్, స్టాండింగ్ కమిటీ సభ్యుల సహకారంతో మంజూరు చేసి విశాఖ నగర అభివృద్ధికి కృషి చేశామన్నారు. సహకరించిన జీవీఎంసీ కమిషనర్లకు, అధికారులకు, ఇంజనీర్లకు కృతజ్ఞతలు తెలిపారు. కౌన్సిల్ కాలం ముగిసిన తర్వాత కూడా వార్డులలో ప్రజల సమస్యలపై సభ్యులు సమర్పించబోవు రిప్రెజెంటేషన్లను పరిగణనలోనికి తీసుకొని జీవీఎంసీ అధికారులు ప్రజా సమస్యలను పరిష్కరించేలా సహకరించాలని చైర్ పర్సన్ అధికారులను కోరారు.
పౌర సంబంధాల అధికారి,జివిఎంసి.

Comments
Post a Comment