Skip to main content

ఉక్కునగరం శ్రీ సత్య సాయి మందిరం లో వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం

భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య కృపాకటాక్షాలతో, ఉక్కునగరం సాయి మందిరంలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం ఎంతో వైభవంగా, భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడింది.
ఈ పవిత్ర సందర్భంగా నిర్వహించిన “శ్రీ సాయిరామ స్వరాంజలి” సంగీత కార్యక్రమం భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్తింది. సమితి గాయకులు ఎంతో భక్తి, శ్రద్ధలతో సాధన చేసి, స్వామి పాదపద్మాలకు అర్పించిన భక్తిగీతాలు కార్యక్రమానికి
ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఈ సందర్భంగా ఆలపించిన ముఖ్యమైన కీర్తనలు:

వినాయక నీ మూర్తికే మా మొదటి

జగదానందకారక జయ జానకి ప్రాణనాయక

జనని శివకామిని

బ్రోవ భయ

బ్రహ్మకడిగిన పాదము (కన్యాదానం)

మనసెరిగినవాడు శ్రీరాముడు

అందరిబంధువయ్య బద్రాచల రామయ్య

రామ కథను వినరయ్య ఇహపర సుఖముల

బంటు నీతి

శ్రీ సీతారాముల కల్యాణం చూతమురారండి

పిడికిట తలంబ్రాల పెళ్లికూతురు

రామన్న రాముడు కొదండ రాముడు

కల్యాణ మహోత్సవంలో భక్తులు కుటుంబ సమేతంగా పెద్ద సంఖ్యలో పాల్గొని, శ్రీ సీతారాముల దివ్య కల్యాణాన్ని దర్శించి, ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవించారు.

ఈ కార్యక్రమం ఉక్కునగరం సాయి సమితి ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించబడింది.

ఉక్కునగరం శ్రీ సత్య సాయి సేవా సమితి కన్వీనర్ శ్రీ డి ఏ వి సన్యాసి రాజు, పదాధికారులు, అనేక మంది భక్తులు పాల్గొన్నారు

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...