Skip to main content

గల్ఫ్‌లో చిక్కుకున్న తెలుగు వారికి అండగా తెలుగు దేశం పార్టీ తరపున ఎన్ఆర్ఐ టిడిపి సెల్ ద్వారా హెల్ప్ లైన్ ఏర్పాటు – క్షణక్షణం పరిస్థితులపై సమీక్ష ▪️ సీఎం చంద్రబాబు స్వయంగా పర్యవేక్షణ — తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు


అమరావతి మార్చి 02: గల్ఫ్ దేశాల్లో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో అక్కడ పరిస్థితులను నిరంతరం సమీక్షిస్తూ అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు తెలిపారు. విదేశాల్లో ఉన్న ప్రతి తెలుగు వానికి తెలుగు దేశం ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

గత నాలుగు రోజులుగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఎన్ఆర్ఐ టిడిపి సెల్ పరిస్థితులను నిరంతరం సమీక్షిస్తూ, గల్ఫ్ దేశాల కోఆర్డినేటర్లతో ప్రతిరోజూ టెలికాన్ఫరెన్సులు నిర్వహిస్తోందన్నారు. అత్యవసర సహాయం అవసరమైన ప్రాంతాల్లో వెంటనే స్పందించేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. అక్కడి ఎన్ఆర్ఐ టీడీపీ సోదరులు సమయానుకూలంగా సహకారం అందిస్తున్నారని, అవసరమైన చోట తాత్కాలిక వసతి, ఆహారం, భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు అన్నారు.

ఆంధ్రప్రదేశ్ నాన్-రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఏపీఎన్‌ఆర్టీఎస్) ద్వారా ప్రభుత్వ సహాయాన్ని కూడా ప్రభావితులకు అందిస్తున్నామని పల్లా వెల్లడించారు. ప్రమాదావకాశం ఉన్న ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు స్థానికంగా ఆయా దేశాలలో ఉన్న ఎన్నారై టీడీపీ కోఆర్డినేటర్ లు సమన్వయం చేస్తున్నారని వివరించారు.

ప్రస్తుత పరిస్థితులపై సమగ్ర నివేదికను పార్టీ జాతీయ అధ్యక్షుడు మరియు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అందజేస్తున్నామని తెలిపారు. కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖతో అవసరమైన సమన్వయం జరిపి, ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా, ప్రభావితులందరికీ తక్షణ సహాయం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా పరిస్థితులను పర్యవేక్షిస్తూ అవసరమైన సూచనలు ఇస్తున్నారని పల్లా పేర్కొన్నారు.

ఈ నేపధ్యంలో తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయం లో కూడా 24/7 హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేశారు. సహాయం అవసరమైన వారు హెల్ప్‌లైన్ / వాట్సాప్ నెంబర్ 95500 57623, 79978 26882 ను సంప్రదించి తమ వివరాలు పంపవచ్చని, అలాగే nricell@telugudesam.org కు మెయిల్ ద్వారా సమాచారం అందించవచ్చని సూచించారు.

                     Sharma K.V. Editor 


విదేశాల్లో ఎక్కడ ఉన్నా ప్రతి తెలుగు వానికి తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని పల్లా శ్రీనివాసరావు పునరుద్ఘాటించారు. సంక్షోభ సమయాల్లో స్పందించే నాయకత్వం రాష్ట్రానికి ఉన్నదన్న విశ్వాసాన్ని మరింత బలపరుస్తున్నామని తెలిపారు.

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...