Skip to main content

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు* *ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాచిపెంట శాంతకుమారి గారికి ఘన సన్మానం*

అల్లూరి సీతారామరాజు జిల్లా, అరకు వేలి మండలం హట్టగూడ గ్రామంలో అరకు వేలి మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి గొల్లూరి పద్మ గారి గృహంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాచిపెంట శాంతకుమారి గారికి పుష్పగుచ్చం అందజేసి, దుశలువ కప్పి స్థానిక మహిళలు, గ్రామస్థులు ఘనంగా సన్మానం చేశారు.

ఈ సందర్భంగా శాంతకుమారి గారు మాట్లాడుతూ, సమాజంలో మహిళలకు సమాన హక్కులు, గౌరవం కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులు, అన్యాయాలను తక్షణమే అరికట్టాలని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.అలాగే ప్రపంచంలోని మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ డుంబ్రిగూడ మండల అధ్యక్షురాలు కొర్రమితుల కిషన్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పాంగి గంగాధర్, ఓబీసీ అల్లూరి జిల్లా చైర్మన్ కన్నూరి ప్రవీణ్, మహిళా నాయకులు గుల్సన్ ఖాన్, కార్యకర్తలు మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...