Skip to main content

వార్డులలో పారిశుధ్యం మెరుగుపరచండి. -జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్

 విశాఖపట్నం మార్చి 5: వార్డులలో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించి పారిశుద్ధ్యం పనులను నిర్వహించాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా గాజువాక జోన్ 73, 72, 66 వార్డుల పరిధిలోని వంటిల్లు, కణితి రోడ్డు ప్రాంతాలు , అన్న క్యాంటీన్ తదితర ప్రాంతాలలో పర్యటించి పారిశుద్ధ్యం, ఇంజనీరింగ్, రెవెన్యూ విభాగాలకు సంబంధించిన అంశాలను పరిశీలించారు.ఈ సందర్భంగా జీవీఎంసీ కమిషనర్ మాట్లాడుతూ 73వ వార్డు వంటిల్లు వద్ద పారిశుధ్యం పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కమర్షియల్ వాహనాల పనితీరును అడిగి తెలుసుకుని, క్లాప్ వాహనాలపై ప్రజల అవగాహన కొరకు జింగిల్ అనౌన్స్మెంట్ చేస్తున్నారా అని ఆరా తీశారు. ఆ మార్గంలో వెళ్తున్న క్లాప్ వాహనం ఎటువంటి అనౌన్స్మెంట్ చేయకపోవడంపై తగిన చర్యలు చేపట్టాలని సహాయక వైద్యాదికారి డాక్టర్ కిరణ్ కుమార్ ను కమిషనర్ ఆదేశించారు. ఫుట్ పాత్ లపై ఆక్రమణలు ఉన్నాయని, వాటిని యుద్ద ప్రాతిపదికన తొలగించాలని, సెల్లార్ ఫ్లోర్లలో ఆక్రమణలను తొలగించాలని జోనల్  కమిషనర్ బి ఆర్ ఎస్ శేషాద్రి ను ఆదేశించారు. అన్న క్యాంటీన్ వద్ద పారిశుద్ధ్య పనులు క్యాంటీన్ నిర్వహణ మొదలైనవి పరిశీలించి ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్లలో నాణ్యతతో భోజనం అందించాలని అలాగే అన్న క్యాంటీన్ ను పరిశుభ్రంగా ఉంచాలని అధికారులకు సూచించారు.

 కణితి రోడ్డులో నిర్మిస్తున్న డ్రైనేజీ పనులను పరిశీలించి పనులు వేగవంతం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఆ ప్రాంతంలోని పాన్ షాప్ ను పరిశీలించి డస్ట్ బిన్లో వ్యర్ధాలు వేసేలా చూడాలని, ప్రతి దుకాణం ముందు డస్ట్ బిన్లు తప్పనిసరిగా ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కాయగూర వ్యర్ధాలు కాలువలో పడవేయడాన్ని గమనించి వాటి నియంత్రణా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వార్డులలో ఆస్తి పన్నుల విధింపు, వసూళ్ళకు సంబంధించి లైన్ లిస్టింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలని వార్డు సచివాలయం కార్యదర్శులను, 

పలు  దుకాణాలలో ఆస్తి పన్నులు చాలా కాలం నుండి పెండింగ్లో ఉన్నాయని వాటిని వెంటనే వారు చెల్లించేలా చర్యలు చేపట్టాలని రెవెన్యూ ఇన్స్పెక్టర్ ను ఆదేశించారు. అలాగే జంక్షన్ అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి సారించి సంబంధించిన పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో వార్డ్ కార్యదర్శులు,తదితరులు పాల్గొన్నారు

పౌర సంబంధాల అధికారిజీవీఎంసీ.


Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...