అల్లవరం, విశాఖ సందేసం....మండలంలోని కోడూరుపాడు గ్రామంలో అల్లవరం మండల వైస్సార్సీపీ ఆధ్వర్యంలో గురువారం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.అల్లవరం మండలం కోడూరుపాడు గ్రామంలో జరిగిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొని, వైయస్ఆర్సీపీ జెండాను పార్టీ శ్రేణులు ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్, మాజీ ఎంపీ చింతా అనురాధ, నియోజకవర్గ ఇంచార్జ్ పీనిపే శ్రీకాంత్ లు ఆవిష్కరణ చేశారు. అనంతరం అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యులు చింతా అనురాధ
పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి అందరికి అందజేశారు. ఈ కార్యక్రమంలో చెల్లుబోయిన శ్రీనివాసరావు, పందిరి హరి, కొనుకు గౌతమి, ఇళ్ల శేషారావు, కొనుకు బాపూజీ, వడ్డి గంగా, యెల్లమెల్లి సుభాష్ చంద్రబోస్, రాకాపు విజయలక్ష్మి, బర్రే సితారత్నం, దొమ్మేటి శ్రీ శాంతి భవాని, పులుసుగంటి రాజేశ్వరి ప్రమోద్, గుత్తుల రాజు, కర్రి వెంకటరామరాజు, సాధానాల శ్రీను, కుడుపూడి సూర్యప్రకాశరావు, సంతోష్, సాపే సత్యనారాయణ, వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Comments
Post a Comment