Skip to main content

రాష్ట్ర వైసీపీ విద్యార్థి విభాగం జనరల్ సెక్రటరీగా మద్దింశెట్టి దుర్గ ప్రసాద్....

అమలాపురం, విశాఖ సందేసం...వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విద్యార్థి విభాగం జనరల్ సెక్రటరీగా నియమితులైన మద్దింశెట్టి దుర్గ ప్రసాద్   మాజీ మంత్రి, అమలాపురం పార్లమెంట్ కో-ఆర్డినేటర్ పినిపే విశ్వరూప్, అమలాపురం అసెంబ్లీ కో-ఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ లను విశ్వరూప్ స్వగృహంలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి విశ్వరూప్ మరియు అమలాపురం నియోజకవర్గం కో-ఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ లు  మాట్లాడుతూ విద్యార్థి విభాగం ద్వారా యువతను ఒక్కటిగా  చేసి, పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. నిరంతరం ప్రజల మధ్య ఉంటూ, పార్టీ అభివృద్ధికి కష్టపడి పనిచేయాలని దుర్గ ప్రసాద్ ను  కోరారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న పట్టణ అధ్యక్షులు సంసాని నాని,,జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు మట్టపర్తి నాగేంద్ర, కౌన్సిలర్ కొల్లాటి దుర్గాబాయి, భరణకాని బాబు, అల్లవరం మండల ఎంపీపీ ఇళ్ల శేషారావు ,తిక్క ప్రసాద్,జిల్లా ఐటీ వింగ్ అధ్యక్షులు తోరం గౌతం ,కొల్లటి పట్టాభి ,కట్టోజు రాము,ఇలకోటి రాంబాబు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...