Skip to main content

ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు విశాఖపట్నం జిల్లా కలెక్టర్ వారి కార్యాలయం ప్రాంగణంలో ఏపీ జేఏసీ మరియు ఏపీ ఆర్ ఎస్ ఏ వారి ఆధ్వర్యంలో జరిగాయి.

 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ గారు  శ్రీ ఎం.ఎన్. హరీంధర్ ప్రసాద్ ఐఏఎస్ గారు వారి సందేశంలో సృష్టిలో మహిళ లేకుండా సృష్టి లేదని మహిళ యొక్క పాత్ర సమాజంలో ఎంతో ఉన్నతమైనదని తెలియజేశారు ఇంటిలో తల్లిగా విద్యాలయాల్లో ఉపాధ్యాయురాలుగా బాధ్యత నిర్వర్తిస్తున్నటువంటి వారు ఉద్యోగ జీవితాల్లో కూడా ఎంతో నిబద్దతో పనిచేస్తూ ప్రతి రంగాలలో వారి యొక్క ఉన్నతిని చాటుతున్నారని అటువంటి మహిళా దినోత్సవ సందర్భంగా మీ అందరికీ నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను అని చెప్పి ఉన్నారు. ఉద్యోగ జీవితంతో పాటు ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త వహించవలెనని మీరు ఆరోగ్యంగా ఉంటే కుటుంబంలో ప్రతి ఒక్కరి భవిష్యత్తు ఎంతో విజయవంతంగా సాగుతుందని తెలియజేశారు. 

ఈ కార్యక్రమానికి జిల్లా జాయింట్ కలెక్టర్ వారు, జిల్లా రెవెన్యూ అధికారిణి శ్రీమతి శేష శైలజ గారు, ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షులు శ్రీ సత్తి నాగేశ్వర్ రెడ్డి గారు, ఏ.పి.ఆర్.ఎస్.ఏ విశాఖపట్నం శాఖ అధ్యక్షులు శ్రీ యస్.ఎ.త్రినాధ్ రావు గారు, కార్యదర్శి శ్రీ పేర్లి శ్యాంప్రసాద్ గారు, కలెక్టర్ కార్యాలయం పరిపాలన అధికారిని శ్రీమతి బి.వి.రాణి గారు, ఏపీ జేఏసీ మహిళ ఛైర్ పర్సన్ శ్రీమతి శైలజ పాణిగ్రహి గారు పాల్గొని ఉన్నారు.

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...