అమలాపురం, విశాఖ సందేసం....బీవీసీ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ భట్లపాలెం క్యాంపస్ నందు ఉచిత పాలిటెక్నిక్ కోచింగ్ కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు బీవీసీ యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది.
ఏప్రిల్ 1వ తేది నుండి బీవీసీ భట్లపాలెం క్యాంపస్ నందు పాలిటెక్నిక్ ఉచిత కోచింగ్ సదుపాయం ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ సదుపాయం పదవ తరగతి విద్యార్థులు ఉపయోగించుకోవాలని కళాశాల యాజమాన్యం కోరింది. చక్కటి ఉపాధి అవకాశములు ఉన్న సాంకేతిక విద్యను ఫీజు రియింబర్సు్మెంట్ సౌకర్యంతో చదువుకునే అవకాశంను సద్వినియోగం చేసుకోవాలని తెలియజేసారు. అనుభవజ్నులైన ఉపాధ్యాయులతో కోచింగ్ ఇప్పించడం జరుగుతుందని, ఇది పూర్తిగా ఉచితం అని తెలియజేసారు. సీట్లు పరిమితం కావున కళాశాలకు నేరుగా విచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని గతంలో బీవీసీ కళాశాలలో కోచింగ్ తీసుకున్న విద్యార్థులు మంచి ర్యాంకులు మరియు ఉచిత సీట్లు సాధించారని, ఈ సదవకాశం ఉపయోగించుకోవలన్నారు. మరిన్ని వివరములుకు 9347822861, 9505518252 సంప్రదించాలి కోరారు.

Comments
Post a Comment