విశాఖపట్నం, మార్చి 7: విశాఖ నగరంలో జరుగుతున్న రోడ్లు, కాలువలు తదితర అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన గాజువాక జోన్ లో గంగవరం రోడ్లో, జగ్గనాయుడు జంక్షన్ లో రోడ్లు కాలువల అభివృద్ధి పనులను పర్యవేక్షక ఇంజనీర్ రాయల్ బాబుతో కలిసి పరిశీలించారు
కమిషనర్ ముందుగా గంగవరం రోడ్డులో రెండు కోట్ల రూపాయలతో మంజూరు చేసి అభివృద్ధి పరుస్తున్న రోడ్డు పనులను పరిశీలించి పనుల వివరాలను అడిగి తెలుసుకుని పనుల ఆలస్యంపై ఆరా తీశారు. అనంతరం జగ్గు జంక్షన్లో రెండు మురుగునీటి కాలువలను పరిశీలించిన అనంతరం జరుగుచున్న రోడ్లు, కాలువలు తదితర అభివృద్ధి పనులు త్వరగా పూర్తిచేసేలా చర్యలు చేపట్టాలని కార్యనిర్వాహక ఇంజనీరు రాయల్ బాబుకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఉప కార్యనిర్వాహక ఇంజనీర్లు, సహాయకు ఇంజనీర్లు, వార్డ్ ఎమినిటీస్ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
పౌర సంబంధాల అధికారి ,జీవీఎంసీ


Comments
Post a Comment