*▪️తాడేపల్లి ప్యాలెస్ లో తయారుచేసిన డేటాతో ప్రజలను మళ్లీ మభ్యపెడుతున్న జగన్ రెడ్డి* *▪️కాగ్ నివేదికను కూడా వక్రీకరిస్తూ తన సొంత మీడియా ముందుకి వచ్చి అబద్ధాలు* *▪️జగన్ రెడ్డి హయాంలో వ్యవస్థలన్నీ తన సొంత ప్రయోజనాల కోసం విధ్వంసం చేసి.. ఇపుడు కొత్త డ్రామాకు తెర లేపాడు* *— టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే శ్రీ పల్లా శ్రీనివాసరావు*
టీం-11 బ్యాచ్‌తో అసెంబ్లీకి వచ్చి గవర్నర్ ప్రసంగం వరకే ఉండి బయటకు వెళ్లిపోవడం ద్వారా తనను ఎన్నుకున్న ప్రజలను జగన్ మోసం చేశాడని పల్లా విమర్శించారు. కౌన్సిల్‌లో తన ఎమ్మెల్సీలతో రభస చేయించి, చర్చలకు వచ్చే సమయానికి బయటకు వెళ్లమని తాడేపల్లి నుంచి ఆదేశాలు జారీ చేయడం జగన్ రాజకీయ సంస్కృతికి నిదర్శనమన్నారు.
*తాడేపల్లి ప్యాలెస్‌లో తయారు చేసిన డేటాతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం*
కాగ్ నివేదికను కూడా తప్పుబడుతూ తాడేపల్లి ప్యాలెస్‌లో తయారు చేసిన డేటాను కాగ్ రిపోర్ట్‌గా చూపిస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడని పల్లా ఆరోపించారు. ఐదేళ్లు ఆర్థిక విధ్వంసానికి పాల్పడిన జగన్ రెడ్డి ఇప్పుడు కాగ్ నివేదికను వక్రీకరించి తన తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడన్నారు.
2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కాగ్ నివేదికలో చూపిన రూ.81,071 కోట్ల అప్పులో పెద్ద భాగం జగన్ ప్రభుత్వం చేసిన అప్పేనని పల్లా గుర్తుచేశారు. ఆ ఏడాదిలో ఏప్రిల్, మే నెలల్లోనే సుమారు రూ.27,205 కోట్ల అప్పు తీసుకున్నది జగన్ ప్రభుత్వమేనన్నారు. ఐదేళ్లలో రాష్ట్ర అప్పులు దాదాపు రూ.9.74 లక్షల కోట్లకు చేరాయని అధికార గణాంకాలు చెబుతున్నాయని తెలిపారు.
ఆర్బీఐ ద్వారా రూ.4.38 లక్షల కోట్లు, కార్పొరేషన్ల ద్వారా రూ.2.48 లక్షల కోట్లు, పబ్లిక్ అకౌంట్ లయబిలిటీగా దాదాపు రూ.80 వేల కోట్లు తీసుకున్నారని చెప్పారు. కాంట్రాక్టర్లకు, పథకాల పెండింగ్ బిల్లులు మాత్రమే రూ.1.13 లక్షల కోట్లు, ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు రూ.21,980 కోట్లు, సివిల్ సప్లైస్ మరియు పవర్ డిస్కామ్ బాకీలు సుమారు రూ.70 వేల కోట్లు ఉన్నాయని వివరించారు. ఐదేళ్లలో రూ.3 లక్షల కోట్లు మాత్రమే అప్పు చేశామని చెప్పే జగన్ కార్పొరేషన్ అప్పులు, గ్యారంటీ అప్పుల గురించి మాత్రం మాట్లాడడం లేదన్నారు.
*సంక్షేమం పేరిట రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన జగన్ రెడ్డి*
సంక్షేమం పేరిట రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బతీయడం, అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టడం జగన్ పాలనలో కనిపించిన నిజ స్వరూపమని పల్లా అన్నారు. సంక్షేమం పేరిట అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేసి కనీసం రోడ్లు కూడా వేయలేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొన్నదన్నారు. కల్తీ మద్యం విధానంతో ప్రజల ప్రాణాలను సైతం ప్రమాదంలోకి నెట్టిన చరిత్ర జగన్ ప్రభుత్వానిదేనన్నారు.
“దోచుకో… పంచుకో… తినికో” అనే నినాదాన్ని ప్రభుత్వ విధానంగా మార్చి రాష్ట్రాన్ని దోపిడీ కేంద్రంగా మార్చారని పల్లా తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో భూకబ్జాలకు పాల్పడే నాయకులను పెంచిపోషించి వ్యవస్థలను పూర్తిగా ధ్వంసం చేశారని ఆరోపించారు.
*మహిళల భద్రతపై మాట్లాడే నైతిక హక్కు లేదు*
మహిళల సంక్షేమం, భద్రత గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్‌కు లేదని పల్లా అన్నారు. తన సొంత నియోజకవర్గం దగ్గరే మహిళలపై దారుణాలు జరిగినా నిందితులపై చర్యలు తీసుకోలేని పాలన జగన్‌దేనన్నారు. కూటమి ప్రభుత్వంలో మాత్రం మహిళల భద్రతకు పూర్తి ప్రాధాన్యత ఇస్తున్నామని, మహిళలపై దాడులు చేస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
*అంగన్వాడీలను మోసం చేసిన వైసీపీ*
అంగన్వాడీ ఉద్యోగుల సంక్షేమం గురించి మాట్లాడే హక్కు కూడా జగన్‌కు లేదని పల్లా అన్నారు. 2014-19 మధ్య అంగన్వాడీల జీతాలను దశలవారీగా పెంచి రూ.11,500 వరకు తీసుకెళ్లిన ఘనత చంద్రబాబు నాయుడు ప్రభుత్వానిదేనన్నారు. కూటమి ప్రభుత్వంలో 5 వేల అంగన్వాడీ సహాయకులను నియమించామని, 5జీ స్మార్ట్‌ఫోన్లు ఇచ్చామని, గ్రాట్యుటీ పెంచామని చెప్పారు. అంగన్వాడీలు ప్రతిపాదించిన 10 డిమాండ్లలో 9 డిమాండ్లను ఇప్పటికే పరిష్కరించామని తెలిపారు. వైసీపీ పాలనలో మాత్రం అంగన్వాడీలను విజయవాడ రోడ్లపై జుట్టు పట్టుకుని లాగించిన ఘటనలను ప్రజలు మరచిపోలేదన్నారు.
*సంక్షోభం నుంచి వికాసం వైపు రాష్ట్రాన్ని నడిపిస్తున్న చంద్రబాబు*
ప్రజలకు అభివృద్ధి అంటే ఏమిటి, నాయకత్వం అంటే ఏమిటి అనేది బాగా తెలుసని పల్లా అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విజన్, విశ్వసనీయత వల్లనే రాష్ట్రానికి పెట్టుబడులు వరదలా వస్తున్నాయని తెలిపారు. గత ప్రభుత్వంలో పారిపోయిన కంపెనీలు కూడా ఇప్పుడు తిరిగి రాష్ట్రానికి రావడానికి క్యూ కడుతున్నాయని పేర్కొన్నారు.
గత ఐదేళ్లలో ఆర్థిక విధ్వంసం జరిగిన రాష్ట్రాన్ని కేవలం 22 నెలల్లోనే వికాసం దిశగా నడిపిస్తున్న నాయకత్వం చంద్రబాబు నాయుడు గారిదేనని పల్లా కొనియాడారు. ప్రజలు నిజాలను గమనిస్తున్నారని, అభివృద్ధి అంటే ఏమిటి, బాధ్యతాయుత పాలన అంటే ఏమిటి అనేది వారికి స్పష్టంగా అర్థమవుతోందన్నారు. జగన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్‌లో తయారు చేసిన అబద్ధాల డేటాతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసినా, వాస్తవాలు బయటపడతాయని పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు.

Comments
Post a Comment