అమలాపురం..విశాఖ సందేసం ప్రథమ మహిళ ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే వర్ధంతి పురస్కరించుకుని అమలాపురం గడియార స్తంభం సెంటర్లో మహా బోధి మహా విహార్ విముక్తి కొరకు నిరసన తెలుపుతూ డా.బి.ఆర్ అంబేడ్క ర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు కుశల రత్న బోధి మాట్లాడుతూ మా ప్రధాన డిమాండ్లు.బుద్ధ గయా టెంపుల్ యాక్ట్ 1949ను వెంటనే రద్దు చేయాలని,మహా బోధి మహా విహార్ ను పూర్తిగా బౌద్ధులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాసకి పద్మ రామ్, మహాలక్ష్మి, బిఎస్ ఐ జిల్లా ఉపాధ్యక్షులు పెట్టా వెంకటరావు,కుసుమ సత్యనారాయణ,బీర బాలు,పెట్టా శ్రీను, బూల కృష్ణ కుమార్, కమిడి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.
మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు
మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...

Comments
Post a Comment