పూర్వ విద్యార్థుల (GAGA) ఆధ్వర్యంలో 'జీవీపీ యూత్ యాక్టివిటీ క్లబ్స్' ఆవిష్కరణ – విద్యార్థి సాధికారతకు సరికొత్త నాంది
విశాఖపట్నం, మార్చి 25, 2026:గాయత్రీ విద్యా పరిషత్ పూర్వ విద్యార్థుల సంఘం (GAGA - Gayatri Grads Association) ప్రత్యేక చొరవతో, గాయత్రి విద్యా పరిషత్ మెడికల్ కాళాశాల ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన "యూత్ యాక్టివిటీ క్లబ్స్" (Youth Activity Clubs) ప్రారంభోత్సవ వేడుక కన్నుల పండుగగా జరిగింది. ప్రస్తుత విద్యార్థులను భావి భారత నాయకులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో, పూర్వ విద్యార్థుల మార్గదర్శకత్వంలో ఈ కార్యక్రమం రూపుదిద్దుకుంది.
ఈ కార్యక్రమం లో గాయత్రి విద్యా పరిషత్ ప్రెసిడెంట్ శ్రీయుతులు దక్షిణామూర్తి గారు మాట్లాడుతూ.. "విద్యార్థి దశ కేవలం చదువుకే పరిమితం కాకూడదు. బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగడానికి సామాజిక స్పృహ, సేవా గుణం అలవర్చుకోవాలి. పూర్వ విద్యార్థుల సహకారంతో ఏర్పాటు చేసిన ఈ క్లబ్‌లు విద్యార్థుల్లో క్రమశిక్షణను, సామాజిక స్పృహను పెంపొందిస్తాయి" అని పేర్కొన్నారు.
గాయత్రి విద్యా పరిషత్ డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ ఆచార్య సోమరాజు గారు తన కీనోట్ ప్రసంగంలో.. "నైపుణ్యం కలిగిన మానవ వనరుల తయారీకి ఈ యాక్టివిటీ క్లబ్‌లు పట్టుకొమ్మల వంటివి. ఈ క్లబ్‌ల ద్వారా విద్యార్థులు తమలోని సృజనాత్మకతను, విశ్లేషణాత్మక ఆలోచనలను పదును పెట్టుకోవాలి. నవకల్పనలకు ఇదొక గొప్ప వేదిక" అని కొనియాడారు.
ఈ వేడుకలో భాగంగా నిర్వహించిన ప్లాంటేషన్ ప్రోగ్రామ్, క్రీడా పోటీలు (వాలీబాల్, త్రో బాల్) విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపాయి. ప్రజా సంబంధాల అధికారి శ్రీమతి శేషపద్మ గారు క్లబ్ల ఏర్పాటు ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో సహకరించిన విద్యార్థిని ,విద్యార్థులకు తమ చేతుల మీదుగా చిరు కానుకలు అందించారు.శ్రీ రఘువీర్ గారు వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కాలేజ్ డీన్ డాక్టర్ సుబ్బారావు గారు,ప్లేస్మెంట్ ఆఫీసర్ ఆచార్య డి.సరిత గారు, డైరెక్టర్స్,విభాగాధ్యక్షులు ,అధ్యాపకులు , విద్యార్థులు పాల్గొన్నారు.ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టిన GAGA ప్రతినిధులు శ్రీ పి రఘువీర్, మహేష్ ఎం మల్ల, శేషు కుమార్, డాక్టర్ వి అర్చన,శ్రీమతి జ్యోతిష్మతి గారిని కాలేజీ యాజమాన్యం అభినందించింది.

ఆచార్య వి.ఎస్.ఆర్.కె. ప్రసాద్ గారు మాట్లాడుతూ.. "నేటి పోటీ ప్రపంచంలో నెగ్గాలంటే అకడమిక్ నాలెడ్జ్‌తో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఎంతో కీలకం. . ఈ క్లబ్‌ల ద్వారా ప్రతి విద్యార్థి ఒక ప్రత్యేక గుర్తింపును సాధించాలి" అని పిలుపునిచ్చారు.ఆచార్య ప్రగడ రాజ గణపతి గాయత్రి విద్యా పరిషత్ సభ్యులు మాట్లాడుతూ"పూర్వ విద్యార్థుల అనుభవం నేటి విద్యార్థులకు దిశానిర్దేశం చేయడం అభినందనీయం అని ఆశీస్సులు అందించారు.
తదనంతరం ముఖ్య అతిథి శ్రీ ఎ. గిరీష్ బాబు గారు , శ్రీమతి శాంతి శ్రీ జడ్జి శ్రీకాకుళం, చేతుల మీదుగా 9 రకాల క్లబ్‌ల లోగోలను ఆవిష్కరించారు. GAGA ప్రెసిడెంట్ మహేష్ ఎం మల్ల స్వాగతోపన్యాసం చేస్తూ, అలుమ్నీ నెట్‌వర్క్ ద్వారా విద్యార్థులకు మెంటార్‌షిప్ అందిస్తామని ప్రకటించార
ఈ వేడుకలో భాగంగా నిర్వహించిన ప్లాంటేషన్ ప్రోగ్రామ్, క్రీడా పోటీలు (వాలీబాల్, త్రో బాల్) విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపాయి. ప్రజా సంబంధాల అధికారి శ్రీమతి శేషపద్మ గారు క్లబ్ల ఏర్పాటు ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో సహకరించిన విద్యార్థిని ,విద్యార్థులకు తమ చేతుల మీదుగా చిరు కానుకలు అందించారు.శ్రీ రఘువీర్ గారు వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కాలేజ్ డీన్ డాక్టర్ సుబ్బారావు గారు,ప్లేస్మెంట్ ఆఫీసర్ ఆచార్య డి.సరిత గారు, డైరెక్టర్స్,విభాగాధ్యక్షులు ,అధ్యాపకులు , విద్యార్థులు పాల్గొన్నారు.ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టిన GAGA ప్రతినిధులు శ్రీ పి రఘువీర్, మహేష్ ఎం మల్ల, శేషు కుమార్, డాక్టర్ వి అర్చన,శ్రీమతి జ్యోతిష్మతి గారిని కాలేజీ యాజమాన్యం అభినందించింది.
Comments
Post a Comment