- కాంగ్రెస్ అధికారంలో ఉన్న 10 ఏళ్లు పండుగలా నడిచింది
- బీజేపీ అధికారంలో వచ్చాక పథకాన్ని బ్రస్టు పట్టించారు
- ఉపాధి హామీ ప్రకారం 100 రోజులు పని కల్పించాలి
- పని అడిగిన 15 రోజుల్లో పని ఇవ్వాలి
- చేసిన పనికి వెంటనే వేతనాలు ఇవ్వాలి
- కానీ బీజేపీ ప్రభుత్వం లో ఉపాధికి ఊపిరి తీశారు
- పథకాన్ని పూర్తిగా నీరు గార్చారు
- గ్రామాలను అభివృద్ధి చేసిన పథకాన్ని తూట్లు పొడిచారు
మోదీ తెచ్చిన VB G- RAM G చట్టం అక్రమ చట్టం
గ్రామాలకు ఉపాధిపై అధికారాలు తొలగించిన చట్టం
- మోదీ తెచ్చిన చట్టం గ్రామస్వరాజ్యం వినాశనం
- ఉపాధి పనిని మోదీకి పనికొచ్చే పథకంలా చేశారు
- ఉపాధి పనిని కాంట్రాక్టర్ల చేతుల్లో పెట్టారు
- కాంట్రాక్టర్లకు లేబర్ సప్లై చేసేలా పథకాన్ని మార్చారు
- విబి జి రామ్ జి చట్టం కాంట్రాక్టర్లకు జేబులు నింపే చట్టం
- 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచడం బూటకం
- బిజెపి హయాంలో 100 రోజుల పనిలోనే 52 రోజులు కూడా ఇవ్వలేదు
- 52 రోజులు పని ఇవ్వని వాళ్ళు 125 రోజులు ఇస్తాం అంటే నమ్మేట్లు ఉందా ?
- ఇదంతా ప్రజలను మభ్యపెట్టడం కోసమే
- ప్రజలను మోసం చేయడానికి కొత్త పథకం భేష్ అని చెప్తున్నారు
- బిజెపి కి చిత్తశుద్ధి ఉంటే జాబ్ కార్డులు ఎందుకు తొలగిస్తున్నారు ?
- ఉపాధి పనికి కాళ్ళు, చేతులు నరుకుతున్నారు
- కాంగ్రెస్ తెచ్చిన మన్రేగా పథకంలో 90 శాతం నిధులు కేంద్రం ఇచ్చేది
- ఇప్పుడు మోదీ తెచ్చిన కొత్త చట్టంలో రాష్ట్రంపై 40 శాతం భారం మోపారు
- జగన్ , చంద్రబాబు దయ వల్ల రాష్ట్రం 12 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది
- పథకాలకు నిధులు ఇచ్చే దిక్కులేదు . జీతాలు చెల్లించే పరిస్థితి లేదు
- VB G- RAM G చట్టం ద్వారా రాష్ట్రంపై 5 వేల కోట్లు భారం
- అప్పుల్లో ఉన్న రాష్ట్రానికి 5 వేల కోట్లు ఎలా ఇస్తారు ?- చంద్రబాబు కొత్త చట్టానికి మద్దతు ఇవ్వడం దారుణం
- జగన్ సైతం మోదీ చేసిన అన్యాయాన్ని ప్రశ్నించడం లేదు
- జగన్ మోదీకి సగిలపడ్డాడు
- బీజేపీకి జగన్ దత్తపుత్రుడు
- YSR వ్యతిరేకించిన బీజేపీ సాగిలపడటం అన్యాయం
- మోదీకి వంగి వంగి దండాలు పెడుతున్నారు
- రాష్ట్రాన్ని ఇద్దరు కలిసి దోచుకు తిన్నారు
- రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ మళ్లీ అధికారంలో రావాలి
- YSR సంక్షేమ పాలన కాంగ్రెస్ తోనే


Comments
Post a Comment