Skip to main content

జనతా వారధి కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేస్తున్న బీజేపీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు శ్రీ MMN పరశు రామ రాజు*

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి సారధ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సోమవారం జరుగుతున్నటువంటి జనతా వారధి ప్రజలకు ప్రభుత్వానికి వారధి కార్యక్రమం లో భాగంగా బీజేపీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు శ్రీ MMN పరశు రామ రాజు గారు మరియు బీజేపీ నాయకులతో కలిసి ఈ రోజు అనగా 02-03-2026 న విశాఖ జిల్లాలో గల పలు సమస్యల పై జిల్లా కలెక్టర్ గారికి గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు పరశు రామ రాజు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో లిక్కర్ స్కాం కు పాల్పడిన ముఖ్య సూత్రధారులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దాడి పురుషోత్తం రమేష్. బీజేపీ రాష్ట్ర ST మోర్చా ప్రధాన కార్యదర్శి SRLN మురళి మోహన్ రాజు, జనతా వారధి కన్వీనర్ పొలిమేర శ్రీనివాస రావు, జనతా వారధి కో కన్వీనర్ మూల వెంకటరావు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు తలాడ గిరిజ, బీజేపీ జిల్లా కార్యదర్శి లంక శ్రీరామ్ మరియు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...