జనతా వారధి కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేస్తున్న బీజేపీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు శ్రీ MMN పరశు రామ రాజు*
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి సారధ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సోమవారం జరుగుతున్నటువంటి జనతా వారధి ప్రజలకు ప్రభుత్వానికి వారధి కార్యక్రమం లో భాగంగా బీజేపీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు శ్రీ MMN పరశు రామ రాజు గారు మరియు బీజేపీ నాయకులతో కలిసి ఈ రోజు అనగా 16-03-2026 న విశాఖ జిల్లాలో గల పలు సమస్యల పై జిల్లా కలెక్టర్ గారికి గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు పరశు రామ రాజు మాట్లాడుతూ సింహాచలం అనుబంధ దేవాలయమైన శ్రీ కాలభైరవ స్వామి వారి దేవాలయానికి వెళ్లే భక్తుల సౌకర్యార్ధం రోడ్డు మరియు షెల్టర్లు, త్రాగునీటి వసతి మరియు టాయిలెట్స్ వంటి వాటిని ఏర్పాటు చేయాలనీ కోరుతూ, రానున్న వసంత నవరాత్రులు, ఉగాది మరియు శ్రీరామ నవమి ఉత్సవాల నిర్వహణకు ప్రత్యేక నిధులను కేటాయించి, ఉగాది కొనుగోలు మార్కెట్లలో ప్రజలకు తగిన సదుపాయాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనతా వారధి కన్వీనర్ పొలిమేర శ్రీనివాస రావు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఉమ్మిడి సుజాత రాజ్, బీజేపీ పార్వతీపురం జిల్లా ఇంచార్జి SVS ప్రకాష్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర ST మోర్చా ప్రధాన కార్యదర్శి SRLN మురళి మోహన్ రాజు, జనతా వారధి కో కన్వీనర్ మూల వెంకటరావు, బీజేపీ జిల్లా మీడియా కన్వీనర్ తిప్పనబోయిన కోటేశ్వర రావు మరియు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.



Comments
Post a Comment