భారతీయ జనతా పార్టీ జనతా వారధి ఉత్తరాంధ్ర కార్యాలయంలో వినతులు స్వీకరించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీ MMN పరశు రామ రాజు గారు.*
విశాఖపట్నం 20-03-2026 శుక్రవారం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి సారధ్యంలో జరుగుతున్న జనతా వారధి ప్రజలకు ప్రభుత్వానికి వారధి కార్యక్రమం లో భాగంగా బీజేపీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు శ్రీ MMN పరశు రామ రాజు గారు జనతా వారధి ఉత్తరాంధ్ర కార్యాలయంలో ప్రజల నుండి వినతులు స్వీకరించారు.
ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు MMN పరశు రామ రాజు మాట్లాడుతూ ప్రజలకు ఎంతో కాలంగా పరిష్కారం కాని సమస్యలను అర్జీలను స్వీకరించి ఈ జనతా వారధి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకొని వెళ్లి పరిష్కరించే దిశగా కృషి చేస్తామని తెలిపారు.
ఈ జనతా వారధి కార్యాలయంలో ప్రతి శుక్రవారం ఒక MLA అందుబాటులో ఉంటూ ప్రజల నుండి అర్జీలను స్వీకరించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని ఉత్తరాంధ్ర ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దాడి పురుషోత్తం రమేష్, బీజేపీ జనతా వారధి కన్వీనర్ పొలిమేర శ్రీనివాస రావు, బీజేపీ జనతా వారధి కో కన్వీనర్ మూల వెంకటరావు, బీజేపీ జిల్లా మీడియా కన్వీనర్ T కోటేశ్వర రావుతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

Comments
Post a Comment