
గిరిజన సహకార సంస్థ లిమిటెడ్ (GCC), విశాఖపట్నం కు ప్రతిష్టాత్మకమైన SKOCH Awards 2025 గిరిజన సంక్షేమ విభాగంలో అవార్డు లభించింది. ఈ అవార్డును నేడు న్యూ ఢిల్లీలో నిర్వహించిన SKOCH అవార్డుల కార్యక్రమంలో గిరిజన సహకార సంస్థ వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి ఎస్.ఎస్. శోఱక, IAS గారు స్వీకరించారు.
"న్యాయమైన మార్కెట్ వ్యవస్థలు మరియు వ్యాపారావకాశాల ద్వారా గిరిజన జీవనోపాధుల అభివృద్ధి మరియు సాధికారత” అనే థీమ్ ఆధారంగా గిరిజన సహకార సంస్థ చేస్తున్న విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు ప్రదానం చేయబడింది. గిరిజన రైతులకు న్యాయమైన మార్కెట్ సౌకర్యాలు కల్పించడం, ప్రాసెసింగ్ మరియు మార్కెటింగ్ వ్యవస్థలను బలోపేతం చేయడం, గిరిజన మహిళలు మరియు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా గిరిజన జీవనోపాధుల అభివృద్ధికి GCC కృషి చేస్తున్నది.
గిరిజన సంక్షేమం మరియు జీవనోపాధుల అభివృద్ధి కార్యక్రమాల భాగంగా గిరిజన సహకార సంస్థ పలు ముఖ్యమైన చర్యలను అమలు చేస్తోంది. చిన్న తరహా అటవీ ఉత్పత్తుల (MFP) కొనుగోళ్లలో కనీస మద్దతు ధర (MSP) విధానానికి అనుగుణంగా పారదర్శకమైన కొనుగోలు వ్యవస్థను అమలు చేసి గిరిజన సేకరణదారులను దళారుల నుంచి రక్షిస్తూ స్థిరమైన ఆదాయాన్ని అందిస్తోంది. వన్ ధన్ వికాస్ కేంద్రాలు (VDVKs) మరియు వన్ ధన్ ప్రొడ్యూసర్ ఎంటర్ప్రైజ్ సొసైటీలు (VDPES) ను బలోపేతం చేసి గిరిజన స్వయం సహాయక సంఘాలు, ముఖ్యంగా మహిళలకు నైపుణ్యాభివృద్ధి, మౌలిక సదుపాయాలు మరియు విలువ ఆధారిత వ్యాపారావకాశాలను కల్పిస్తోంది.
దేశవ్యాప్తంగా గిరిజన ఉత్పత్తులకు మార్కెట్ విస్తరణ కోసం ప్రదర్శనలు, ట్రేడ్ ఫెయిర్లు మరియు బ్రాండింగ్ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉత్పత్తులకు మంచి గుర్తింపు మరియు మెరుగైన ధరలు సాధించే దిశగా చర్యలు తీసుకుంటోంది. అదేవిధంగా, అటవీ వనరులపై గిరిజన హక్కులను రక్షిస్తూ, సంప్రదాయ జీవన విధానాలను కాపాడుతూ, స్థిరమైన సేకరణ విధానాలను ప్రోత్సహిస్తోంది. కొనుగోలు మరియు ప్రాసెసింగ్ కార్యకలాపాల్లో డిజిటల్ చెల్లింపులు, ఈ-ఆక్షన్ వ్యవస్థ, నాణ్యత నియంత్రణ మరియు సాంకేతిక పర్యవేక్షణ ద్వారా పారదర్శకత మరియు సమర్థతను పెంచుతోంది.
గిరిజన ఉత్పత్తులకు న్యాయమైన ధరలు కల్పించడం మరియు గిరిజన ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడం ద్వారా గిరిజన సంక్షేమం మరియు ఆర్థిక సాధికారతను. పెంపొందిస్తున్నందుకు ఈ అవార్డు లభించింది.
ఈ సందర్భంగా వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి ఎస్.ఎస్. శోబిక, IAS గారు మాట్లాడుతూ, ఈ అవార్డు గిరిజన రైతుల కృషి, సంస్థ సిబ్బంది అంకితభావం మరియు ప్రభుత్వం అందిస్తున్న నిరంతర సహకారానికి గుర్తింపుగా లభించిందని తెలిపారు. భవిష్యత్తులో గిరిజనుల ఆర్థికాభివృద్ధి మరియు న్యాయమైన మార్కెట్ వ్యవస్థలను మరింత బలోపేతం చేయడానికి గిరిజన సహకార సంస్థ కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు.
ఈ ప్రతిష్టాత్మక అవార్డు లభించడం గిరిజన సహకార సంస్థకు గర్వకారణమని పేర్కొంటూ, గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధి మరియు గిరిజన జీవనోపాధుల సాధికారత కోసం మరింత కృషి కొనసాగిస్తామని సంస్థ వెల్లడించింది.
Sharma K.V. Editor
Comments
Post a Comment