Skip to main content

గౌ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మే నెలాఖరుకు బృహత్ ప్రణాళిక ప్రాధాన్యత రహదారులను పూర్తి చేయాలి, VMRDA చైర్మన్ శ్రీ ఎంవి ప్రణవ్ గోపాల్ మరియు మెట్రోపాలిటన్ కమిషనర్ శ్రీ N తేజ్ భరత్ IAS

VMRDA చైర్మన్ శ్రీ ఎంవి ప్రణవ్ గోపాల్ మరియు మెట్రోపాలిటన్ కమిషనర్ శ్రీ N తేజ్ భరత్, IAS., సంయుక్తంగా ఈ రోజు నిర్వహించిన సాంకేతిక విభాగపు సమీక్ష సమావేశంలో జోన్ల వారీగా పనుల ప్రగతిని సమీక్షించిన తదుపరి చైర్మన్ ప్రణవ్ గోపాల్ మాట్లాడుతూ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కార్యకలాపాలను ప్రారంభించేనాటికి, భోగాపురం ఎయిర్ పోర్టు కు అనుసంధానించే బృహత్ ప్రణాళిక ప్రాధాన్యత రహదార్లను మే నెలాఖరునాటికి పూర్తి చేస్తామన్నారు. భోగాపురం ఎయిర్ పోర్టు కు నగరం నుంచి ఎటువంటి అవరోధములు లేకుండా సమయానికి చేరుకోవడమే రహదారుల విస్తరణ ప్రధాన ఉద్దేశమని,  ప్రస్తుతం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ఈ రహదారులు నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వం కూడా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని ఆయన తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు VMRDA పరిధిలోని అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో కూడా రహదారుల, పార్కుల నిర్మాణనికి అధిక ప్రాధాన్యమిస్తున్నామన్నారు. మెట్రోపాలిటన్ కమిషనర్ శ్రీ తేజ్ భరత్ మాట్లాడుతూ సంస్థ చేపట్టిన 7 ప్రాధాన్యత రహదారుల విస్తరణ పనులు ప్రస్తుతం సుమారు 60 శాతం వరకు పూర్తి అయ్యాయని, నాణ్యతలో ఎలాంటి రాజీ లేకుండా, అన్ని విభాగాల అధికారుల సమన్వయంతో నిర్దిష్ట కాలపరిమితిలోగా ప్రాధాన్యత రహదార్ల పనులన్నీ ఎట్టి పరిస్థితుల్లో  శత శాతం పూర్తి చేయాలని ఇంజనీర్లను ఆదేశించారు. అలాగే ప్రారంభించవలసిన కొత్త పనులకు శంకుస్థాపనలు, పూర్తయిన పనులకు ప్రారంభోత్సవాలకు తగిన ఏర్పాట్లను చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జాయింట్ కమిషనర్ శ్రీ రమేష్ కార్యదర్శి, శ్రీ మురళీకృష్ణ, ప్రధాన ఇంజనీర్ శ్రీ వినయ్ కుమార్ పర్యవేక్షక ఇంజనీర్లు శ్రీ భవానీ శంకర్, శ్రీ మధుసూదనరావు, కార్యనిర్వహక ఇంజనీర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
Sharma K.V. EDITOR 

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...