Skip to main content

VMRDA ఇంజనీరింగ్ విభాగపు పనితీరుపై చైర్మన్ మరియు మెట్రోపాలిటన్ కమిషనర్ సమీక్ష

VMRDA చేపడుతున్న పనుల ప్రగతిపై సమావేశ మందిరంలో జరిగిన సమీక్షా సమావేశంలో చైర్మన్ శ్రీ ఎం.వి.ప్రణవ్ గోపాల్ మరియు మెట్రోపాలిటన్ కమిషనర్ శ్రీ ఎన్ తేజ్ భరత్,IAS., ఇరువురు డివిజన్ల వారిగా సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా VMRDA చైర్మన్ శ్రీ ఎం.వి.ప్రణవ్ గోపాల్ మాట్లాడుతూ ఇప్పటికే పూర్తయిన లేఅవుట్లు స్థలాలను ఆక్షన్ ద్వారా విక్రయించి సంస్థకు ఆర్ధిక పరిపుష్టి చేకూరేవిధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. క్షేత్ర స్థాయిలో ఇంజనీర్లు క్రియాశీలకంగా వ్యవహరించాలని,అలసత్వం ప్రదర్శిస్తే ఉపేక్షించేది లేదని, నిర్దేశించిన కాలపరిమితిలోగా పనులను ఎట్టిపరిస్థితుల్లో పూర్తి చేసి, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను కలసికట్టుగా చేరుకొని పురోగతిని సాధిద్దామన్నారు. మెట్రోపాలిటన్ కమిషనర్ శ్రీ తేజ్ భరత్, IAS., మాట్లాడుతూ బృహత్ ప్రణాళిక రహదారుల నిర్మాణంలో అడ్డంకిగా ఉన్న విద్యుత్ స్తంభాలను తరలించేందుకు సత్వరమే చర్యలు చేపట్టాలని, రహదారి విస్తరణలో ఆస్తులు కోల్పోతున్న యజమానులకు TDR పంపిణీ చేసే విధంగా GVMC అధికారుల సమన్వయంతో ముందుకు సాగాలని అన్నారు.  అదేసమయంలో సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ప్రధాన ఇంజినీర్ శ్రీ వినయ్ కుమార్, కార్యదర్శి శ్రీ మురళీకృష్ణ, పర్యవేక్షక ఇంజనీర్లు భవానీ శంకర్, మధుసూదనరావు, కార్యనిర్వహక ఇంజనీర్లు, ఇతర ఇంజనీరింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...