Skip to main content

ప్రజా దర్బార్ కి వచ్చిన వినతుల పరిష్కారంలో అలసత్వం వద్దు * VMRDA చైర్మన్ శ్రీ ఎం వి ప్రణవ్ గోపాల్ , మెట్రోపాలిటన్ కమిషనర్ శ్రీ తేజ్ భరత్

 VMRDA లో ప్రతీ సోమవారం నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కి వచ్చి అందజేసిన వినతుల పరిష్కారంలో అలసత్వం వహించవద్దని VMRDA చైర్మన్ శ్రీ ఎం వి ప్రణవ్ గోపాల్ గారు ఆదేశించారు. సోమవారం ఉదయం VMRDA కార్యాలయం 3 వ అంతస్తు సమావేశమందిరంలో మెట్రోపాలిటన్ కమిషనర్ శ్రీ N తేజ్ భరత్, IAS., గారితో కలిసి ప్రజా దర్బార్ లో పాల్గొని, ప్రజల నుంచి వినతులు అందుకున్నారు. ఫిర్యాదిదారులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రతి సమస్య గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నారు. వినతులను, ఫిర్యాదులను నిర్దేశించిన గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. ముందుగా ప్రతీ సమస్యకు సమాధానం ఇవ్వాలని పేర్కొన్నారు. న్యాయ సంబంధిత సమస్యలను మినహాయించి, మిగిలిన వాటిని అన్ని  పరిశీలించాలని కోరారు. వినతుల పరిష్కారంలో సిబ్బంది జవాబుదారీగా ఉండాలని ఆదేశించారు. ఈ ప్రజా దర్బార్ కి మొత్తం 10 వినతులు రాగా, వాటిలో పరిపాలన పరమైన వినతులు అత్యధికంగా 7 వరకు రావటంతో మరో మూడు మిగతా విభాగాలకు చెందిన వినతులు వచ్చాయి. 

కార్యక్రమం లో  జాయింట్ కమిషనర్  శ్రీ రమేష్, కార్యదర్శి శ్రీ మురళీ కృష్ణ, ప్రణాళికాధికారిణి శ్రీమతి శిల్పా, ఎస్టేట్ అధికారి దయానిధి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...