వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ వాసవియన్ సిద్ధ వెంకట సూర్య ప్రకాష్ రావు గారు మరియు ఇంటర్నేషనల్ సెక్రెటరీ (సర్వీసెస్) Vn. జూలూరి రమేష్ బాబు గారు తమ విశాఖపట్నం టూర్ లో భాగంగా ఈ రోజు విశాఖపట్నం పాత నగరంలో గల వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయం సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలనొర్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు.
ఈ సందర్భంగా దేవాలయంలో దేవాలయ సంఘ అధ్యక్షులు ఆరిశెట్టి దినకర్ అధ్యక్షతన ఏర్పాటుచేసిన కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిధి మాట్లాడుతూ 150 సంవత్సరాల చరిత్ర గల పురాతన ఆలయానికి విచ్చేసిన ఆనందం వ్యక్తపరుస్తూ ఆలయ పునర్నిర్మానికి ఆర్యవైశ్యులందరూ కలసి తమ సహాయ సహకారాలందించాలన్నారు. దేవాలయ పునర్నిర్మాణానికి తన తరఫున నిర్మాణానికి కావలసిన గ్రానైట్ ను ఉచితంగా సరఫరా చేయుచున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో దేవాలయ సంఘ కార్యదర్శి పెనుగొండ కామరాజు మాట్లాడుతూ దేవాలయ చరిత్ర, పునర్నిర్మానం గావించవలసిన అవసరాన్ని వివరించారు.
కార్యక్రమంలో దేవాలయ సంఘ కోశాధికారి దోమా వెంకట బాలాజి కుమార్, వాసవిక్లబ్ ఇంటర్నేషనల్ పూర్వపు అధ్యక్షులు ఏ.వి.ఎస్.ఎన్. గుప్త, పూర్వపు గవర్నర్స్ శ్రీయుతులు వేద మధుసూదన్, నల్లూరి నూకరాజు, కొల్లూరు సోమేశ్వరరావు, దింతకుర్తి నాగేశ్వరరావు, మొగల్లూరి రవికుమార్, మరియు దేవాలయ సంఘ పూర్వపు అధ్యక్షులు పెనుగొండ వెంకట చంద్రశేఖర రావు,
మరియు అధిక సంఖ్య లో ఆర్యవైశ్యులు పాల్గొన్నారు

Comments
Post a Comment