అంతర్జాతీయ స్థాయిలో విశాఖ నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 31 వ CII partnership summit నేపథ్యంలో బందోబస్తు నిర్వహించబోవు అధికారులకు, సిబ్బందికి పోలీసు ఉన్నతాధికారులతో కలిసి బ్రీఫింగ్ ఇచ్చిన నగర పోలీసు కమీషనర్ డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పి.ఎస్., గారు.*

విశాఖపట్నం సిటీ, ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ నందు నిర్వహిస్తున్న ఈ 31 వ CII partnership సమ్మిట్ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగినది. నగర పోలీసు కమీషనర్ డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పి.ఎస్., గారి ఆధ్వర్యంలో సుమారు 2700 మంది (పోలీసు ఉన్నతాధికారులతో పాటుగా, 35 మంది ఏ.సి.పి లు, 103 మంది సీ.ఐ లు, 250 మంది ఎస్.ఐ లు, సుమారు 1800 మంది ఏ.ఎస్.ఐ, హెచ్.సి, పి.సి, హెచ్.జి) సిబ్బంది తో సదస్సుకు పకడ్బంధీగా భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగినది.

 సదస్సు ప్రాంగణంతో పాటుగా, నగరంలో ముఖ్య ప్రాంతాలన్నీ  డ్రోన్ల తో, సీసీటీవీ కెమెరాలతో, బాడీ వార్న్ కెమెరాలతో, ఇతర సాంకేతిక చర్యలతో  కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తూ కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగినది.  

🔳 నగరానికి విచ్చేయనున్న  దేశ విదేశాల ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలు మరియు ప్రముఖుల కోసం ఇప్పటికే పోలీసు అధికారులు మరియు సిబ్బందితో  నిరంతర నిఘాతో, నగర ప్రజల భద్రతతో పాటుగా నగరానికి వచ్చు విదేశీ ప్రతినిధులకు, వి.ఐ.పిలకు, సదస్సులకు పూర్తి భద్రతా చర్యలు చేపట్టమైనది.

🔳 సరికొత్త యాప్ ద్వారా సదస్సుకు వచ్చే ప్రతీ సంస్థ ప్రతినిధులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా సమయానికి సదస్సు ప్రాంగణం చేరుకునేలా ఏర్పాటు చేయడం జరిగినది.

🔳నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని హోటల్స్ లో, లాడ్జీలలో,రిసార్టులలో,గెస్ట్ హౌస్ లలో నగర పోలీసులు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నారు

🔳ఆంధ్ర విశ్వ విద్యాలయం, ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ వద్ద గల సదస్సు ప్రాంగణం వద్దా , హెలిపాడ్ ల వద్దా మరియు సదస్సుకు హాజరగు ప్రతినిధులకు వసతి కల్పించే హోటళ్ల వద్దా స్నిఫర్ డాగ్ స్క్వాడ్లతో, బాంబు స్క్వాడ్లతో క్షుణ్ణంగా పరిశీలీస్తున్నారు.

🔳సదస్సుకు వచ్చే ప్రతినిధులు, వి.ఐ.పిలు ప్రయాణించు రహదారులూ, సదస్సు వద్దా పూర్తి నిఘాతో ఏ.ఎస్.సి ,ఆర్.ఓ.పి లను నిర్వహిస్తున్నారు.

🔳బందోబస్తును పలు కేటగిరిలుగా విభజించి, పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టి, ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క పోలీసు ఉన్నతాధికారిని పర్యవేక్షణాధికారిగా నియమించడం జరిగినది.

🔳నగరంలో ముఖ్య ప్రాంతాలలో పికెట్స్,గార్డులను ఏర్పాటు చేసి నిరంతరం వాహనాలను తనిఖీ చేయడం జరుగుతుంది.

🔳నగర కమిషనర్ గారు పలు శాఖల నగర అధికారులతో పాటూ, రాష్ట్రఅధికారులతో సమావేశాలు నిర్వహిస్తూ భద్రతా మరియు ఇతర ఏర్పాట్లను చర్చిస్తున్నారు.

🔳ప్రత్యేక కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి సీసీ కెమెరాలతో సదస్సు చుట్టూ ప్రత్యేక నిఘా పెట్టడం జరిగినది.

🔳ఆర్.ఓ.పి లు,ఏ.ఎస్.సి టీంలతో  నగరంలో వి.ఐ.పి లు, సదస్సుకు వస్తున్న ప్రతినిధులు ప్రయాణిస్తున్న రహదారులను అనుక్షణం తనిఖీలు చేయడం జరుగుతుంది.

🔳 నగరంలో ట్రాఫిక్ సజావుగా సాగేందుకు అస్త్రం యాప్ ను వినియోగించడం జరుగుతుంది, నగరంలో మూడు రోజుల పాటు ఎంతో ప్రతిస్టాత్మకముగా జరగబోతున్న ఈ సదస్సుకు ఎటువంటి లోపాలు లేకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టడం జరిగినది,  నగర ప్రజలు పోలీసులకు సహకరించి, రాష్ట్ర ప్రగతిని పెంపోందించే ఈ సదస్సు మరింత విజయప్రదం చేయాలని పోలీసు వారి విజ్ఞప్తి.

               నగర పోలీసు తరపున,

                  విశాఖపట్నం సిటీ

Dr Nanduri Ramakrishna Buero Chief Andhra Pradesh 

Post a Comment

0 Comments