అల్లవరం గ్రామ అభివృద్దే ద్యేయం: సర్పంచ్ అభ్యర్థి జంగా బుజ్జి.... అల్లవరంలో ప్రచారానికి శ్రీకారం....

.


అల్లవరం, విశాఖ సందేశం...అల్లవరం గ్రామ ప్రజలకు అన్ని వేళల అందుబాటులో ఉంటూ గ్రామ సమస్యలను పరిష్కారం చేసి అభివృద్ధికి కృషి చేస్తానని జంగా బుజ్జి అన్నారు.అల్లవరం గ్రామ ప్రజల అభిష్టం మేరకు అల్లవరం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా జంగా వెంకట రత్నం నాయుడు 


 జంగా బుజ్జి  ఎన్నికల ప్రచారం గ్రామంలో శ్రీకారం చుట్టారు. జంగా బుజ్జి మాట్లాడుతూ గత పాలకులు ప్రజలకు చేసిన సేవలను  ఆదర్శంగా తీసుకుని అల్లవరం  గ్రామంలో ప్రధాన సమస్యలు డ్రైనేజి, పారిశుద్యం, తాగునీరు సరఫరా వంటి సమస్యలను పరిష్కారం చేస్తానని బుజ్జి గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు.గ్రామ ప్రజలందరూ తనకు  అమూల్యమైన ఓటును వేసి అఖండ విజయం  చేకూర్చాలని బుజ్జి ఆకాంక్షించారు. 


ఈ కార్యక్రమంలో  మంచిగంటి సత్యనారాయణ. ముత్యల బాబి, తిక్కిరెడ్డి శ్రీనివాస్, ఆకుల వెంకటేశ్వరరావు (ఎల్.ఐ.సి.),కంకిపాటి వెంకటేశ్వరరావు (జిమ్), జంగా నాయుడు, దాసం వీరేంద్ర, రాసూరి రాంబాబు  పాల్గొన్నారు....

Post a Comment

0 Comments