గ్రంధాల‌యాలు జ్ఞాన కేంద్రాలు


ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం,న‌వంబ‌ర్19:గ్రంధాల‌యాలు జ్ఞానకేంద్రాలుగానిలుస్తాయ‌నిఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం ఉప‌కుల‌ప‌తి ఆచార్య జి.పి రాజ‌శేఖ‌ర్ అన్నారు. గురువారం డాక్ట‌ర్ వి.ఎస్ కృష్టా గ్రంధాల‌యంలో గ్రంధాల‌య వారోత్స‌వాల‌లో భాగంగా నిర్వ‌హిస్తున్న ప్ర‌త్యేక పుస్త‌క ప్ర‌ద‌ర్శ‌న‌ను ఆయ‌న తిల‌కించారు. ఈ సంద‌ర్భంగా పుస్త‌క ప్ర‌ద‌ర్శ‌న‌లో ఉంచిన వివిధ పుస్త‌కాల‌ను తిల‌కించారు.ఉత్త‌రాంధ్ర క‌ధ‌లు, తెలుగు  మాండ‌లీకాలు, క్రీడ‌ల‌కు సంబంధించిన పుస్త‌కాల‌ను ఆస‌క్తిగా చ‌దివారు. అనంత‌రం పుస్త‌క ప్ర‌ద‌ర్శ‌న తిల‌కించ‌డానికి వ‌చ్చిన విద్యార్థుల‌తో ఆయ‌న మాట్లాడారు. సాంకేతిక‌త ఎంత అభివృద్ధి చెందినా పుస్త‌క జ్ఞానం ఎంతో విలువైన‌ద‌న్నారు. విద్యార్థులు గ్రంధాల‌యాల‌ను సంద‌ర్శించ‌డం, అక్క‌డ ఉన్న వైవిధ్య‌మైన పుస్త‌కాల నుంచి జ్ఞానాన్ని పొందే ప్ర‌య‌త్నం జ‌ర‌గాల‌ని సూచించారు. యువ‌త‌ను గ్రంధాల‌యాల దిశ‌గా న‌డిపించే దిశ‌గా అధికారులు కృషి చేయాల‌న్నారు. 


ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం గ్రంధాల‌యం విశిష్ట‌త‌లు విద్యార్థుల‌కు వివ‌రించాల‌న్నారు. గ్రంధాల‌యం ఆధునీక‌ర‌ణ‌, సుంద‌రీక‌ర‌ణ‌కు ప్ర‌త్యేక చ‌ర్య‌లు చేప‌ట్టాల‌న్నారు. కార్య‌క్ర‌మంలో గ్రంధాల‌యాధికారి ఆచార్య సి.హెచ్ శ్రీ‌నివాస రావు త‌దిత‌రులు పాల్గొన్నారు. 


ప్ర‌త్యేక ప్ర‌ద‌ర్శ‌న‌...పుస్త‌క ప్ర‌ద‌ర్శ‌న‌లో భాగంగా సంగీతం, నృత్యం, తెలుగు భాష‌-సాహిత్యం, వైద్యం, క‌ళ‌లు, ఔష‌ధ మెక్క‌లు, ప‌క్షులు, జీవిత చ‌రిత్ర‌లు, యోగా, ఎర్త్ సైన్స్‌, అట్లాస్‌లు, చిత్ర‌లేఖ‌నం, తాళ ప‌త్రాలు, వంద‌ల సంవ‌త్స‌రాల నాటి పురాత‌న పుస్త‌కాలు వంటివి ప్ర‌ద‌ర్శించారు. నిత్యం వంద‌లాది మంది క‌ళాశాల‌లు, పాఠ‌శాల‌ల విద్యార్థులు ప్ర‌ద‌ర్శ‌న‌కు తిల‌కిస్తున్నారు. క‌ళాశాల‌లు, పాఠ‌శాల‌ల యాజ‌మాన్యాలు చొర‌వ తీసుకుని విద్యార్థుల‌ను పుస్త‌క ప్ర‌ద‌ర్శ‌న‌కు తీసుకురావాల‌ని గ్రంధాల‌యాధికారి సూచించారు.

Post a Comment

0 Comments