Skip to main content

Posts

Featured Post

భారతీయ జనతా పార్టీ జనతా వారధి ఉత్తరాంధ్ర కార్యాలయంలో వినతులు స్వీకరించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీ MMN పరశు రామ రాజు గారు.*

విశాఖపట్నం 20-03-2026 శుక్రవారం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి సారధ్యంలో జరుగుతున్న జనతా వారధి ప్రజలకు ప్రభుత్వానికి వారధి కార్యక్రమం లో భాగంగా బీజేపీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు శ్రీ MMN పరశు రామ రాజు గారు జనతా వారధి ఉత్తరాంధ్ర కార్యాలయంలో ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు MMN పరశు రామ రాజు మాట్లాడుతూ ప్రజలకు ఎంతో కాలంగా పరిష్కారం కాని సమస్యలను అర్జీలను స్వీకరించి ఈ జనతా వారధి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకొని వెళ్లి పరిష్కరించే దిశగా కృషి చేస్తామని తెలిపారు.  ఈ జనతా వారధి కార్యాలయంలో ప్రతి శుక్రవారం ఒక MLA అందుబాటులో ఉంటూ ప్రజల నుండి అర్జీలను స్వీకరించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని ఉత్తరాంధ్ర ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దాడి పురుషోత్తం రమేష్, బీజేపీ జనతా వారధి కన్వీనర్ పొలిమేర శ్రీనివాస రావు, బీజేపీ జనతా వారధి కో కన్వీనర్ మూల వెంకటరావు, బీజేపీ జిల్లా మీడియా కన్వీనర్ T కోటేశ్వర రావుతో పాటు  పలువురు నా...
Recent posts

జారీచేసినవారు: డా.పి.జగదీశ్వర రావు, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి, విశాఖపట్నం, తేది. 20.03.2026

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విశాఖ వైద్య ఆరోగ్య శాఖ ఆర్.సి.నెం.17716/మొబైల్ మెడికల్ యూనిట్/ ఎస్.హెచ్.టి.ఒ./2025 తేది. 22.02.2026 వారి ఆదేశానుసారం డా.పి.జగదీశ్వర రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వారు విశాఖపట్నం జిల్లా కూ సంబందించిన పనిచేయని 104 సేవల యొక్క 20 పనికిరాని పాత వాహనములను   ‘ఇ-కొనుగోలు’ పోర్టల్ వెబ్సైటు ద్వారా తేది 26.03.2026 ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 04 గంటల వరకు ఆన్లైన్ ద్వారా ఇ-వేలం ద్వారా విక్రయించుటకు నిర్ణయించారు. సదరు వేలం యొక్క నియమనిబందనలు మరియు మిగిలిన వివరములు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారి ఇ-వేలం పోర్టల్ https://konugolu.ap.gov.in నందు పొందుపరచబడినవి అని తెలియచేయడమైనది.         జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి             విశాఖపట్నం

హరిశ్చంద్రపురం మరియు పాతపట్నం స్టేషన్లలో రైళ్లకు ప్రయోగాత్మక నిలుపుదల ఏర్పాటు

ప్రాంతీయ ప్రయాణికుల సౌలభ్యాన్ని పెంచడం మరియు రైల్వే కనెక్టివిటీని మెరుగుపరచడం లక్ష్యంగా, ఈస్ట్ కోస్ట్ రైల్వే 58506/58505 విశాఖపట్నం–గుణుపూర్–విశాఖపట్నం ప్యాసింజర్ రైలుకు హరిశ్చంద్రపురం PH (HCM) స్టేషన్‌లో మరియు 18117 రౌర్‌కెలా–గుణుపూర్–రౌర్‌కెలా రాజ్యరాణి ఎక్స్‌ప్రెస్ రైలుకు పాతపట్నం   (PHM) స్టేషన్‌లో ప్రయోగాత్మక నిలుపుదలని ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగాత్మక నిలుపుదలని హరిశ్చంద్రపురం స్టేషన్‌లో ఈ రోజు ఉదయం 08.33 గంటలకు భారత ప్రభుత్వ గౌరవనీయ పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ కె. రామ్ మోహన్ నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవసాయం, సహకారం, మార్కెటింగ్ & పశుసంవర్ధక, పాడి పరిశ్రమ మరియు మత్స్యశాఖ మంత్రి శ్రీ కె. అచ్చన్నాయుడు గారు మరియు డివిజనల్ రైల్వే మేనేజర్ శ్రీ లలిత్ బోహ్రా గారు తదితర ప్రముఖులు ప్రారంభించారు అలాగే,  పాతపట్నం   స్టేషన్‌లో ఈ ప్రయోగాత్మక నిలుపుదలని ఉదయం 11.51 గంటలకు భారత ప్రభుత్వ గౌరవనీయ పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ కె. రామ్ మోహన్ నాయుడు గారు,  పాతపట్నం   ఎమ్మెల్యే శ్రీ మామిడి గోవిందరావు గారు మరియు డివిజనల్ రైల్వే మేనేజర్ శ్రీ లలిత్ బోహ...

విశాఖ సందేశం ఎడిటర్ కె.వి. శర్మ.కి ఉగాది అవార్డుతో సత్కరించారు

విశాఖపట్నం : మురళీనగర్ ఎన్జీవో కాలనీలోని శ్రీ వైభవ వేంకటేశ్వర స్వామి వారి కళావేదికలో గురువారం రాత్రి బీజేపీ ఓబీసీ మోర్చా విశాఖ జిల్లా మీడియా కన్వీనర్‌, బీసీ కార్పొరేషన్‌ మాజీ డైరెక్టర్‌ నిడుమోలు రవికుమార్‌ ఆధ్వర్యంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో భాగంగా విశాఖ సందేశం  సంపాదకులు కె.వి. శర్మను ముఖ్య అతిథులు ఉగాది పురస్కారంతో సత్కరించారు: టీడీపీ మాజీ ఎమ్మెల్సీ, సీనియర్ బీసీ నాయకుడు దువ్వారపు రామారావు, విశాఖ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పరశురామరాజు, ప్రముఖ పారిశ్రామికవేత్త చొక్కాకుల వెంకట్‌రావు, జనసేన నాయకుడు పసుపులేటి ఉషా కిరణ్.గాడీ అవార్డులతో ఇతర విద్యార్థులతో కలిసి సాధించిన తన విజయాన్ని ఆయన నాకు గుర్తు చేశారు.

జాబ్ క్యాలెండర్ విడుదలపై విశాఖలో నిరుద్యోగుల ఘన విజయోత్సవ ర్యాలీ 'Thank You Nara Lokesh Sir' అంటూ నినాదాలు..

జాబ్ క్యాలెండర్ అవకాశాన్ని కష్టపడి చదివి సద్వినియోగం చేసుకోవాలి: ప్రభుత్వ విప్ వేపాడనిరుద్యోగుల కలలను సాకారం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉగాది రోజున జాబ్ క్యాలెండర్ విడుదల చేయడంపై నిరుద్యోగులు ధన్యవాదాలు తెలియజేస్తూ విశాఖలో ఘనంగా విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. శాసన మండలి ప్రభుత్వ విప్ వేపాడ చిరంజీవిరావు, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, టీడీపీ అనకాపల్లి పార్లమెంటు అధ్యక్షుడు చోడే వెంకట పట్టాభిరాం తదితరులు పాల్గొన్న ఈ ర్యాలీలో నిరుద్యోగులు 'Thank you Lokesh Sir' అని నినదిస్తూ ప్లకార్డులు ప్రదర్శించి తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. ఎంవీపీ కాలనీలో నిర్వహించిన ఈ ర్యాలీ అనంతరం ప్రభుత్వ విప్ వేపాడ చిరంజీవిరావు మాట్లాడుతూ.. ఏళ్ల తరబడి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువత బాధలను యువగళం పాదయాత్రలో మంత్రి నారా లోకేశ్ స్వయంగా విన్నారని గుర్తు చేశారు. అప్పుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ వివిధ శాఖల్లో 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం చారిత్రిక ఘట్టమని అన్నారు. యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, కేంద్రంలో UPSC మాదిరిగా రాష్ట్రంలో కూడా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల ...

సత్య సాయి సేవా సంస్థలు, విశాఖ జిల్లా శ్రీ సత్య సాయి యువజన విభాగం (యువత) *దీనుల సేవలో దైవ దర్శనం – ఆంధ్రప్రదేశ్ యువజన పర్తి యాత్రలో భాగంగా విశాఖ జిల్లా శ్రీ సత్యసాయి యువత సంచార ఆర్త జనోద్ధరణ సేవ*

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శత వర్ష జన్మదిన బ్రహ్మోత్సవాల సందర్భంగా మరియు ఆంధ్రప్రదేశ్ యువజన పర్తి యాత్రలో భాగంగా, విశాఖపట్నం జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల యువత విభాగం “మొబైల్ ఆర్థజనోద్ధరణ సేవ” అనే మహత్తర సేవా కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించింది. స్వామివారి దివ్య ఆశీస్సులతో ఈ సేవా కార్యక్రమం అగనంపూడి, కుర్మన్నపాలెం, కేవీకే మందిరం, పెదగంట్యాడ, పంతులగారి మేడ, మింది తో పాటు నగరంలోని మరిన్ని ప్రాంతాలలో ఈ ఆర్త జనోద్ధరణ సేవ  నిర్వహించబడింది. విశాఖపట్నం జిల్లా శ్రీ  సత్యసాయి యువత, మానసికంగా అస్వస్థతతో నిరాధారంగా జీవిస్తూ, అనేక నెలలుగా స్నానం చేయక జుట్టు పెరిగిపోయిన వ్యక్తులను గుర్తించి, వారిని ప్రేమతో చేరదీసి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సమాజంలోని నిరుపేదలు, నిరాధారుల జీవితాల్లో మార్పు తీసుకురావాలనే మహోన్నత సంకల్పంతో విశాఖ యువత ఎంతో ప్రేమతో, అంకితభావంతో ఈ సేవను నిర్వహించారు. ముఖ్యంగా యువత స్వయంగా ముందుకు వచ్చి జుట్టు కత్తిరించడం, గడ్డం తీయడం (టాన్సరింగ్) వంటి సేవలను నేర్చుకొని స్వయంగా నిర్వహించడం ఈ కార్యక్రమానికి ప్రత్యేకతను తీసుకువచ్చింది. అనంతరం వారికి వెచ్చని నీట...

మాట ఇచ్చాం… అమలు చేశాం… ఉగాది రోజునే జాబ్ క్యాలెండర్ విడుదల* *▪️ జాబ్ క్యాలెండర్‌తో యువతకు భరోసా…* *▪️ సంక్షేమం–అభివృద్ధి సమన్వయంతో ‘బ్రాండ్ ఆంధ్ర’గా రాష్ట్రం అవతరణ* *— టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు*

అమరావతి, మార్చి 19:* తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పాల్గొన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు రాష్ట్ర ప్రజలందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి, మంత్రి నారా లోకేష్ గారి నిరంతర కృషి, పట్టుదలతో కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ ప్రజల్లో విశ్వాసాన్ని మరింత బలపరుస్తోందని పేర్కొన్నారు. యువత భవిష్యత్తుకు బాటలు వేసే దిశగా మంత్రి నారా లోకేష్ విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ చారిత్రాత్మక నిర్ణయమని పల్లా అన్నారు. 10,060 పోస్టులతో ప్రారంభమైన ఈ నియామక ప్రక్రియ ద్వారా గ్రూప్-1, గ్రూప్-2, పోలీస్, ఉన్నత విద్య, పాఠశాల విద్య, ఏఈఈ తదితర విభాగాల్లో భారీ నియామకాలు చేపడుతున్నామని తెలిపారు. యువతకు ఉపాధి కల్పించడంలో లోకేష్ గారి కృషి ఆదర్శప్రాయమని కొనియాడారు.  *6.28 లక్షల ఉద్యోగాలు… ఉపాధి సృష్టిలో కూటమి ప్రభుత్వం దూసుకుపోతోంది*  జాబ్ క్యాలెండర్‌కు ముందే కూటమి ప్రభుత్వం మొత్తం 6,28,347 ఉద్యోగాలు కల్పించిందని పల్లా తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాలు 30,607, ...