నామినేషన్ల గడువు ముగిసిన నామినేషన్ స్వీకారణపై విచారణ చేయాలి.....


అమలాపురం, విశాఖ సందేశం....గ్రామ  పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అల్లవరం మండలం మొగళ్లమూరు నామినేషన్ కేంద్రంలో గడువు ముగిసినప్పటికీ నామినేషన్లు స్వీకరించిన అంశంపై సమగ్ర విచారణ చేయాలని వైసిపి నేతలు డిమాండ్ చేశారు. మాజీ ఎంపీ చింత అనురాధ, వైసిపి పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్, అమలాపురం ఆర్డీవో సరళ దేవికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల నిబంధనల మేరకు అధికారులు వ్యవహరించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బర్రె సితారత్నం, సత్యనారాయణ,  వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..

Post a Comment

0 Comments