ముగిసిన రెండు రోజుల 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు. గతానికి భిన్నంగా జరిగిన 31వ సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్.


విశాఖపట్టణం :పెట్టుబడులతోపాటు... ప్రభుత్వ పాలసీలపై రెండు రోజుల భాగస్వామ్య సదస్సులో ప్రధానంగా చర్చ.

రాష్ట్రంలోని పెట్టుబడులకు భధ్రత కల్పించేలా చట్టం చేస్తామంటూ కీలకప్రకటనచేసినముఖ్యమంత్రి.ఇకపై ప్రతేడాది ఎంఓయూల గ్రౌండింగ్ పై ఆడిట్ రిపోర్ట్ ఇస్తామన్న సీఎం చంద్రబాబు.

పెట్టుబడిదారుల మధ్య పెద్ద ఎత్తున చర్చకు తెరలేపిన స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం.


పొరుగు రాష్ట్రాల నుంచి పోటీ ఉన్నప్పటికీ... స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం వల్లే ఏపీ పట్ల ఆకర్షితులయ్యామని తెలిపిన వివిధ పారిశ్రామిక వేత్తలు.

డేటా సెంటర్లపై జరుగుతున్న దుష్ప్రచారానికి భాగస్వామ్య సదస్సు వేదికగా చెక్ చెప్పిన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్.

నదుల అనుసంధానం వల్ల పరిశ్రమలు సహా వివిధ వర్గాలకు కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించిన రెండు రోజుల భాగస్వామ్య సదస్సు.

పెట్టుబడుల సదస్సు వేదికగా పేదల వాయిస్ ను బలంగా వినిపించిన ముఖ్యమంత్రి.


ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు కార్పోరేట్ కంపెనీలు ముందుకు రావాలంటూ పిలుపు ఇచ్చిన సీఎం చంద్రబాబు.

పీ4లో భాగస్వాములయ్యేందుకు ముందుకు వచ్చి ఒప్పందాలు కుదుర్చుకున్న టీసీఎస్, హీరో కార్పోరేషన్ లిమిటెడ్.

పెట్టుబడులు, అభివృద్ధి, సంక్షేమం విషయంలో సీఎం చంద్రబాబు రూపొందించిన విధానాలపై కేంద్ర మంత్రుల కితాబులు.

సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, మంత్రుల సమక్షంలో పెట్టుబడులకు కీలక కంపెనీల ఒప్పందాలు.

మరో ప్లాంట్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి సమక్షంలో ఒప్పందం కుదుర్చుకున్న కియా కార్ల ఫ్యాక్టరీ.


సీఎం సమక్షంలో పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకున్న సెయింట్ గోబెయిన్స్, గెయిల్, గ్రీన్ కో, కాకినాడ సీ-పోర్ట్స్ సహా వివిధ కీలక సంస్థలు, 

లోకేష్ సమక్షంలో పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకున్న రెన్యూ, మెగా, రష్మీ మెటలార్జికల్, క్లీన్ మ్యాక్స్ ఎనర్జీ, యునైటెడ్ టెలికాం, హీరో, రేస్ పవర్, వారీ ఎనర్జీస్ వంటి ప్రముఖ సంస్థలు.

రెండు రోజుల భాగస్వామ్య సదస్సులో అందర్నీ ఆకట్టుకున్న ఎంఎస్ఎంఈ ఎగ్జిబిషన్.


అంతరిక్ష పరిశోధనలకు అవసరమైన ఎక్విప్మెంట్ మొదలుకుని పూత రేకుల వరకు తాము రూపొందించిన వివిధ ఉత్పత్తులను ప్రదర్శించిన వివిధ ఎంఎస్ఎంఈల కంపెనీలు.

రెండు రోజుల సదస్సులో ఆకట్టుకున్న లైవ్ పాడ్ కాస్టులు.. ఫైర్ సైడ్ చాట్లు.

మంత్రి నారా లోకేష్ తో హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన, హీరో రానా చేసిన ఇంటర్వ్యూలకు అద్భుత స్పందన.

Post a Comment

0 Comments