చాచా నెహ్రూ జయంతి వేడుకలు


జవహర్ లాల్ నెహ్రూ గారి జయంతి వేడుకలను వివేకానంద సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వివేకానంద సంస్థ గౌరవ అధ్యక్షులు డాక్టర్ జహీర్ అహ్మద్ గారు, ద్రోణం రాజు. శ్రీ వాత్సవ్ పాల్గొని, నెహ్రూ గారి చిత్రపటానికి పూలమాలను సమర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ,

జవహర్లాల్ నెహ్రూ భారతదేశపు తొలి మాజీ ప్రధానమంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు. ఆయన సహాయ నిరాకరణోద్యమం, ఉప్పు సత్యాగ్రహం క్విట్ ఇండియా ఉద్యమాల సమయంలో 9 సార్లు అరెస్టయి జైలుకి కెళ్ళారు. పిల్లలు అంటే ఆయనకు ఎంతో ఇష్టం అందుకే అయిన పుట్టినరోజును బాలల దినోత్సవం గా జరుపుకుంటారు అని విద్యార్థులకు తెలియజేశారు. శ్రీ వాత్సవ్ మాట్లాడుతూ వీరందరూ జీవిత చరిత్రలు మనం తెలుసుకోవాలని, భారతదేశం పట్ల దేశభక్తిని కలిగి ఉండాలని ఆయన కోరారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు,  నోటు పుస్తకాలను, చాక్లెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు అప్పారావు, సంస్థ సభ్యులు సూర్యచంద్రరావు మరియు ముస్లిం నాయకులు సలీం, యాసిన్ బాబ్జి మరియు T. కృష్ణ పాల్గొన్నారు .

Post a Comment

0 Comments