శ్రీ స్వామి వివేకానంద ఆశ్రమ వాసులకు, వివేకానంద సంస్థ గౌరవ అధ్యక్షులు మరియు A.N. బీచ్ హాస్పిటల్ M.D. డాక్టర్ జహీర్ అహ్మద్, గారు ప్రతి 3 నెలలకు ఒకసారి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, వైద్య సేవలను అందిస్తున్నారు. ఈరోజు ఆశ్రమంలో నివసిస్తున్న వృద్ధులకు టెస్టులు చేసి, ఉచితంగా మందులను కూడా అందించారు. ఆశ్రమ వాసులకే కాదు, సంస్థ సభ్యులకు కూడా ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు. సంస్థ అధ్యక్షులు అప్పారావు మాట్లాడుతూ, ఉచిత వైద్య పరీక్షలే కాదు, అవసరమైతే హాస్పిటల్లో ఉచితంగా ఎడ్మిట్ చేసి ఎటువంటి ఫీజు తీసుకోకుండా ఉచిత వైద్య సేవలందిస్తున్న డాక్టర్ గారికి ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుల సూరాడ. అప్పారావు డాక్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
0 Comments