ఆరు నెలల సాధనతో 1539 ఫిడే చెస్ రేటింగ్ సాధించిన ప్రణతి మద్దింశెట్టి


అమలాపురం, విశాఖ సందేశం...చెస్ ఆటను ప్రారంభించిన కేవలం ఆరు నెలల వ్యవధిలోనే మద్దింశెట్టి  ప్రణతి D/0 మద్దిoశెట్టి ప్రసాద్*,1539 అంతర్జాతీయ ఫిడే (FIDE) రేటింగ్ సాధించి ప్రతిభ చాటింది. ఇటీవల కర్నూలులో జరిగిన టోర్నమెంట్‌లో ఉత్తమ ఆటతీరుతో ఈ రేటింగ్‌ను సొంతం చేసుకుంది.  వేద్ చెస్ అకాడమీ అమలాపురంలో చీఫ్ కోచ్ జి.వి. రమణ వద్ద శిక్షణ పొందుతున్న ప్రణతి అమలాపురం ఐరా ఇంటర్నేషనల్ స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతూ, రోజుకు 4 నుండి 6 గంటల పాటు క్రమం తప్పకుండా సాధన చేయడం వల్లే ఇంత తక్కువ సమయంలో ఈ స్థాయికి చేరుకోగలిగింది. ఈ ఘనత సాధించిన సందర్భంగా అకాడమీ తరపున ప్రణతిని ప్రత్యేకంగా అభినందించారు. పట్టుదల, నిరంతర శ్రమ ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపిస్తూ ఆమె నేటి విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తోంది.

Post a Comment

0 Comments