విశాఖపట్నం, నవంబర్ 15 : మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న APDPMS బిల్డింగ్ అప్లికేషన్లు, లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (LRS) దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రత్యేక టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరం (స్పెషల్ డ్రైవ్ )కార్యక్రమం నిర్వహించనున్నట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
జీవీఎంసీ ప్రధాన కార్యాలయం సమావేశ మందిరంలో నవంబర్ 18 ,19 ,20 తేదీలలో మూడు రోజులపాటు ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు ఈ ప్రత్యేక ఓపెన్ ఫోరం కార్యక్రమం నిర్వహించనున్నట్లు కమిషనర్ తెలిపారు.
ఈ ప్రత్యేక ఓపెన్ ఫోరంలో APDPMS బిల్డింగ్ అప్లికేషన్లు, LRSకు సంబంధించిన పెండింగ్ దరఖాస్తులపై ప్రధానంగా దృష్టి సారిస్తారని తెలిపారు. సంబంధిత దరఖాస్తుదారులు, లైసెన్స్‌డ్ టెక్నికల్ పర్సన్స్ (LTPs) తమ పెండింగ్ దరఖాస్తులకు సంబంధించిన సమస్యలు, అభ్యంతరాలు, ఇతర అంశాలను నేరుగా పట్టణ ప్రణాళిక అధికారుల దృష్టికి తీసుకువచ్చి, వాటి పరిష్కారానికి అవసరమైన సత్వర చర్యలు పొందవచ్చని పేర్కొన్నారు.
పెండింగ్ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియను వేగవంతం చేసి, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రత్యేక టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరం ( స్పెషల్ డ్రైవ్) కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు.
కావున, జీవీఎంసీ పరిధిలోని సంబంధిత దరఖాస్తుదారులు, LTPలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని APDPMS , LRS లకు సంబంధించిన పెండింగ్ సమస్యలను పరిష్కరించుకోవాలని కమిషనర్ కేతన్ గార్గ్ కోరారు.
పౌర సంబంధాల అధికారి, జీవీఎంసీ.

0 Comments