సింహాచలం, నవంబర్ 15: 2026.శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి వారి దేవస్థానంలో నిర్వహిస్తున్న 'సింహాద్రి నాథ శాశ్వత అన్నప్రసాద పథకం' నిమిత్తం విశాఖపట్నం, విశాలాక్షి నగర్ (సంజీవి నగర్)కు చెందిన మన్నె బుచ్చిబాబు గారి కుమార్తె మన్నె వర్షిణి రూ. 5,32,000/- (ఐదు లక్షల ముప్పై రెండు వేల రూపాయలు) భారీ విరాళాన్ని అందజేశారు.
ఆదివారం నాడు ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ జల్లేపల్లి వెంకట్రావు ని కలిసి దాత ఈ విరాళానికి సంబంధించిన చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు దాతకు స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ వేద పండితులు దాతకు వేదాశీర్వచనం అందజేయగా, అధికారులు స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి ప్రసాదాలను అందజేశారు.

0 Comments