విశాఖపట్నం పోర్టు అభివృద్ధి కార్యక్రమాల్లో గౌరవ కేంద్ర మంత్రివర్యులు, గౌరవ ఎంపీ శ్రీ భరత్ గారితో పాల్గొన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. పోర్ట్ పార్క్ ప్రారంభోత్సవంతో పాటు ,ఎస్ఎల్ కెనాల్ 18 కోట్లు తో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేయడం పట్ల పోర్ట్ చైర్మన్ గారికి, డిప్యూటీ చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే*


విశాఖపట్నం పోర్ట్ అథారిటీలో కేంద్ర మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ చేతుల మీదుగా జరిగిన పోర్ట్ ప్రొమెనేడ్ ప్రారంభోత్సవం, ఎస్‌టీపీ సామర్థ్య పెంపు, 5 బెర్త్‌ల పీపీపీ నిర్వహణ కార్యక్రమాల్లో దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే, జనసేన పార్టీ విశాఖ నగర అధ్యక్షులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు పాల్గొన్నారు.

విశాఖ పోర్టు అభివృద్ధి ద్వారా నగరానికి ఉపాధి, పర్యాటకం, వాణిజ్య అవకాశాలు పెరుగుతాయని, పోర్టును ప్రజలకు చేరువ చేసే ప్రొమెనేడ్ వంటి ప్రాజెక్టులు విశాఖ ప్రతిష్టను మరింత పెంచుతాయని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు అభిప్రాయపడ్డారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో విశాఖ దక్షిణ నియోజకవర్గంతో పాటు నగర సమగ్ర అభివృద్ధికి తాను నిరంతరం కృషి చేస్తానని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీ మతుకుమిల్లి శ్రీభరత్, రాజ్యసభ సభ్యులు శ్రీ గొల్ల బాబూరావు, విశాఖ ఉత్తర ఎమ్మెల్యే శ్రీ పి. విష్ణుకుమార్ రాజు, పోర్ట్ చైర్మన్, డిప్యూటీ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments