శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం, సింహాచలం సింహాచలంలో వైభవంగా ప్రారంభమైన శ్రీమణవాళ మహామునుల తిరునక్షత్రోత్సవాలు ఐదు రోజుల పాటు విశేష ఉత్సవాలు – ఆర్జిత సేవలు రద్దు


సింహాచలం, నవంబర్ 12, 2026: ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచల శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దివ్య సన్నిధిలో శ్రీమణవాళ మహామునుల తిరునక్షత్రోత్సవాలు  శాస్త్రోక్తంగా, వైభవంగా జరుగుతున్నాయి . 

ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పారు.

ఈ ఉత్సవాలు నవంబర్ 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఐదు రోజుల పాటు నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఆలయ ఆస్థాన మండపంలో శ్రీ స్వామివారు, అమ్మవార్ల ఉత్సవమూర్తులను వేంచేపు చేసి ప్రతిరోజూ విశేష పూజలు, సంప్రదాయబద్ధమైన ఉత్సవ కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

శ్రీమణవాళ మహామునుల తిరునక్షత్రోత్సవాల నిర్వహణ నేపథ్యంలో ఆలయంలో నవంబర్ 9 నుంచి 13వ తేదీ వరకు ఐదు రోజుల పాటు అన్ని రకాల ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు.

నిత్య దర్శనాలకు వచ్చే భక్తులు ఈ విషయాన్ని గమనించి, తమ దర్శన ప్రణాళికలను అందుకు అనుగుణంగా ఏర్పాటు చేసుకోవాలని, ఉత్సవాల నిర్వహణకు దేవస్థానానికి సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

Post a Comment

0 Comments