విశాఖపట్నం, నవంబర్ 20, 2026: ప్రేమను పంచుతూ.. ఆనందాన్ని నింపుతూ – 162 మంది అభాగ్యులకు భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి శత వర్ష జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా సేవలందించిన శ్రీ సత్యసాయి విద్యావిహార్ విద్యార్థులు*
ప్రేమ, కరుణ, నిస్వార్థ సేవాభావానికి చక్కని నిదర్శనంగా శ్రీ సత్యసాయి విద్యావిహార్, విశాఖపట్నం విద్యార్థులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా జన్మదిన వేడుకలలో భాగంగా నేడు వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా పదవ తరగతి X-B, X-D విద్యార్థులు తమ ఉపాధ్యాయులతో కలిసి విశాఖపట్నంలోని నాలుగు సేవా సంస్థలను సందర్శించి, మొత్తం 162 మంది లబ్ధిదారులకు నిత్యావసర సరుకులు, ఆహార పదార్థాలు, టాయిలెట్రీ కిట్లు, దుప్పట్లు, బెడ్షీట్లు తదితర అవసరమైన వస్తువులను అందజేసి ప్రేమాభిమానాలను పంచుకున్నారు.
టీచర్లు వెంటారాగా, వారి సూచనలతో సేవా కార్యక్రమాలు విద్యార్థినీ, విద్యార్థులు ఈ క్రింది నాలుగు సంస్థల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు.*
1. చెవిటి, మూగ పిల్లల పాఠశాల, చినవాల్తేర్
X-B తరగతికి చెందిన 35 మంది బాలురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా 75 కిలోల బియ్యం, 4 కిలోల కందిపప్పు, 4 కిలోల మినప్పప్పు, 5 కిలోల ఇడ్లీ రవ్వ, 5 కిలోల సూజీ, 3 లీటర్ల వంటనూనె, 2 కిలోల బెల్లం, 3 ఫినాయిల్ బాటిళ్లు, 35 టాయిలెట్రీ కిట్లు, 35 దుప్పట్లు, 3 కిలోల చింతపండు, 2 కిలోల రాగులు, 2 కిలోల వాషింగ్ పౌడర్, 2 ప్యాకెట్ల బ్లీచింగ్ పౌడర్, పండ్లు, బిస్కెట్లు, కేకులు, 35 న్యాప్కిన్లు అందజేశారు.
2. లెబెన్షిల్ఫే (Lebenshilfe), ఎంవీపీ కాలనీ
X-B తరగతికి చెందిన 50 మంది బాలికలు సేవలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా 75 కిలోల బియ్యం, 4 కిలోల కందిపప్పు, 4 కిలోల మినప్పప్పు, 5 కిలోల ఇడ్లీ రవ్వ, 5 కిలోల సూజీ, 3 లీటర్ల వంటనూనె, 2 కిలోల బెల్లం, 3 ఫినాయిల్ బాటిళ్లు, 50 టాయిలెట్రీ కిట్లు, 50 దుప్పట్లు, 3 కిలోల చింతపండు, 2 కిలోల రాగులు, 2 కిలోల వాషింగ్ పౌడర్, 2 ప్యాకెట్ల బ్లీచింగ్ పౌడర్, పండ్లు, బిస్కెట్లు, కేకులు, 50 న్యాప్కిన్లు అందజేశారు.
3. ఆనంద్ మార్గ్ అనాథాశ్రమం, ఓల్డ్ డెయిరీ ఫారం లో X(పదవ) -D తరగతికి చెందిన 52 మంది బాలురు సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా 75 కిలోల బియ్యం, 4 కిలోల కందిపప్పు, 4 కిలోల మినప్పప్పు, 5 కిలోల ఇడ్లీ రవ్వ, 5 కిలోల సూజీ, 3 లీటర్ల వంటనూనె, 2 కిలోల బెల్లం, 3 ఫినాయిల్ బాటిళ్లు, 52 టాయిలెట్రీ కిట్లు, 52 బెడ్షీట్లు, 3 కిలోల చింతపండు, 2 కిలోల రాగులు, 2 కిలోల వాషింగ్ పౌడర్, 2 ప్యాకెట్ల బ్లీచింగ్ పౌడర్, పండ్లు, బిస్కెట్లు, కేకులు అందజేశారు.
4. కేర్ అండ్ లవ్, మాధవధార లో X-D తరగతికి చెందిన 25 మంది బాలికలు సేవలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా 75 కిలోల బియ్యం, 4 కిలోల కందిపప్పు, 4 కిలోల మినప్పప్పు, 5 కిలోల ఇడ్లీ రవ్వ, 5 కిలోల సూజీ, 3 లీటర్ల వంటనూనె, 2 కిలోల బెల్లం, 3 ఫినాయిల్ బాటిళ్లు, 25 టాయిలెట్రీ కిట్లు, 25 బెడ్షీట్లు, 3 కిలోల చింతపండు, 2 కిలోల రాగులు, 2 కిలోల వాషింగ్ పౌడర్, 2 ప్యాకెట్ల బ్లీచింగ్ పౌడర్, పండ్లు, బిస్కెట్లు, కేకులు, డైపర్లు, 25 న్యాప్కిన్లు అందజేశారు.
ఈ సేవా కార్యక్రమాల ద్వారా విద్యార్థులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి “అందరినీ ప్రేమించండి – అందరికీ సేవ చేయండి” అనే అమూల్య సందేశాన్ని ఆచరణలో పెడుతూ, కరుణ, కృతజ్ఞత, వినయం, సమాజం పట్ల బాధ్యత వంటి విలువలను పెంపొందించుకున్నారు.
విద్య అంటే కేవలం జ్ఞానాన్ని సంపాదించడం మాత్రమే కాకుండా, ప్రేమను సేవగా మలచి తోటి మానవుల జీవితాల్లో ఆనందాన్ని నింపడమే నిజమైన విద్య అని ఈ సేవా కార్యక్రమాలు చాటిచెప్పాయి.









0 Comments