భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బిజెపి జిల్లా అధ్యక్షులు పరశురామరాజు గారి అధ్యక్షతన నిర్వహించిన పత్రిక సమావేశానికి 20 సూత్రాల కార్యక్రమాల కమిటీ చైర్మన్ లంకా దినకర్( వికసిత్ భారత్ - స్వర్ణ ఆంధ్రప్రదేశ్ )ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.


విశాఖపట్నం: 14 -12-2026 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.....స్థానిక సంస్థల నుండి దేశ అభివృద్ధి వరకు ప్రజల విశ్వాసం చొరగొన్న కూటమి 

రాష్ట్ర ప్రజలు అభివృద్ధి - సంక్షేమం - పారదర్శకత కోసం ప్రజలు ట్రిపుల్ ఇంజన్ సర్కార్ కోరుకున్నారు “ ప్రజల ఆశీస్సులతో ప్రధాని నరేంద్ర మోడీ గారి సహకారం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దార్శనికత మరియు పవన్ కళ్యాణ్ గారి సమన్వయంతో రాష్ట్రంలో పట్టణ మరియు గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలలో అద్భుతమైన ఫలితాలు సాధించాం.

ఎన్నికలలో ప్రజలు గ్రామీణ మరియు పట్టణ స్థానిక శక్తిని చాటారు.రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ గారి అధ్యక్షతన కూటామి సమన్వయంతో రాష్ట్రంలో బీజేపీ మెరుగైన ఫలితాలు సాధించింది.

రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ గారు, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి గారు మరియు ఇతర నాయకుల సమన్వయంతో బీజేపీ ని బలోపేతం చేస్తాం.

వికసిత్ భారత్ - స్వర్ణ ఆంధ్రప్రదేశ్ సాధన దిశ గా  “ వికసిత స్వర్ణ “ పట్టణం, గ్రామం, డివిజన్, వార్డు ప్రాధాన్యతగా రాష్ట్రంలో ట్రిపుల్ ఇంజన్ సర్కార్ పని చేస్తుంది.

బీజేపీ రాష్ట్రంలో మున్సిపల్  4 మంది మున్సిపల్ ఛైర్మెన్లు, 40 మంది కార్పొరేటర్లు, 113 మంది మున్సిపల్ కౌన్సిలర్లు, 23 మంది జేపీటీసీలు మరియు 169 మంది ఎంపీటీసీలు విజయం సాధించి ప్రతి జిల్లా నుండి ప్రాతినిధ్యంతో బలమైన రాజకీయ పునాది వేశారు.

ఇప్పుడు రెండవ దశలో జరగబోయే పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా మంచి ఫలితాలు కూటమి సాదిస్తుంది, అందులో బీజేపీ కూడా తన పాత్ర పోషిస్తుంది.

ఈవీఎం లతో ఎన్నికలు వద్దు బ్యాలెట్ ముద్దు అనే వారు ఇప్పుడు ఏమి సమాధానం చెబుతారు…  ఎన్నికలు ఈవీఎం ద్వారా అయినా, బ్యాలెట్ ద్వారా అయినా ప్రజలు ఆశీర్వదించి ఎవరికి పట్టం కట్టాలో - ఎవరిని మడత పెట్టి పక్కకి పెట్టాలో ప్రజలకి స్పష్టంగా తెలుసు.

ఈవీఎం ద్వారా ఎన్నికలు జరిగితే ఉదయం 11.30 గంటలకు ఫలితాలు వచ్చేవి, బ్యాలెట్ లో సాయంత్రం 4 లేదా 5 గంటలకు రావడం జరిగింది అంటే కేవలం వ్యత్యాసం కొన్ని గంటల ప్రయాస మినహా అంతిమ ఫలితం ప్రజలు ఇచ్చిన తీర్పు ఒక్కటే - కూటమి అద్భుత విజయం.

విశాఖపట్నం జిల్లా బీజేపీ అధ్యక్షులు పరశురామ రాజు గారు మరియు వివిధ డివిజన్లలో కార్పొరేటర్లుగా విజయం సాధించిన బీజేపీ నాయకులకు మరియు కూటమి కార్పొరేటర్లకు, జేపీటీసీ లకు, ఎంపీటీసీ లకు శుభాకాంక్షలు.

స్థానిక సంస్థల నిధులు : 16వ ఆర్ధిక సంఘం సిఫారసు మేరకు 2026 - 27 నుండి 2030 - 31 మధ్య కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 4.40 లక్షల కోట్లు గ్రామీణ స్థానిక సంస్థలకు, 3.6 లక్షల కోట్లు పట్టణ స్థానిక సంస్థలకు మరియు ప్రత్యేక మౌలిక సదుపాయాల కల్పనకు 66 వేల కోట్లు మంజూరు చేస్తే, అందులో ఆంధ్రప్రదేశ్ కి 16.63 కోట్లు గ్రామీణ స్థానిక సంస్థలకు, పట్టణ స్థానిక సంస్థలకు 12.16 వేల కోట్ల అందుతున్న సందర్భంగా ఆ నిధుల సమర్ధవంత వినియోగం చేయడంలో బీజేపీ, తెలుగుదేశం మరియు జనసేన నేతృత్వంలోని ట్రిపుల్ ఇంజన్ సర్కార్ కూటమి ద్వారా ఎన్నిక కాబడిన ప్రజాప్రతినిధులు కృషి చేస్తారు.

దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ జీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గడిచిన 12 సంవత్సరాలలో చేసిన సంస్కరణలు, అభివృద్ధి మరియు సంక్షేమం ఫలితంగా 50 కోట్ల మంది పేదరికం నుండి బయటకు రావడం జరిగిందని ప్రపంచ బ్యాంకు నివేదికకు మూలం దేశాశంలో 80 కోట్ల మందికి ( ఏపీ లో 2.70 కోట్ల మందికి ) ఉచితంగా ఆహార ధాన్యాలు, దేశంలో 4.50 లక్షల కుటుంబాలకు ( ఏపీ లో 25 లక్షల కుటుంబాలకు ) పీఎంఏవై ద్వారా నివాస గృహాలు, దేశంలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో గ్రామీణ ప్రాంతాలలో జల్ జీవన్ మిషన్ 1.0 మరియు 2.0 ద్వారా 12 లక్షల కోట్ల తో 19.70 కోట్ల గ్రామీణ కుటుంబాలకు ( ఏపీ లో 97 లక్షల కుటుంబాలకు ) సురక్షిత త్రాగు నీరు కుళాయి ద్వారా అందించడానికి జరుగుతున్న పనులు, అమృత్ 1.0 మరియు 2.0 ద్వారా 3.75 లక్షల కోట్లతో ( ఏపీ కోసం 15 వేల కోట్లు ) పట్టణాలలో  సురక్షిత త్రాగు నీరుకోసం, దేశంలో మహిళ సాధికారతతో 3.50 కోట్ల మంది ( ఏపీ లో 23 లక్షల మంది ) లక్ పతి దీదీలుగా ఆవిర్భవించారు, దేశంలో 41 కోట్ల మంది ( ఏపీ లో 1.52 కోట్లు కార్డుల ద్వారా 4.90 కోట్ల మంది సభ్యులుగా చేరారు ) ఆయుష్మాన్ భారత్ కార్డులు ఇచ్చి 5 లక్షల లోపు ఉచిత వైద్యం అందించడం జరుగుతుంది, ఇప్పటి వరకు దేశంలో 10 కోట్ల హాస్పిటల్ అడ్మిషన్లతో 1.40 లక్షల కోట్లు ఖర్చు చేయడం జరిగింది. దేశంలో 59.72 కోట్ల జన్ ధన్ ఖాతాలు ద్వారా 45 లక్షల కోట్ల రూపాయలకు పైగా కేంద్ర ప్రభుత్వ పథకాల సబ్సిడీలు నేరుగా లబ్ధిదారులకు అందాయి.

ప్రపంచంలో యుద్ధాలు వల్ల అభివృద్ధి చెందిన దేశాలు సైతం కునరిలుతున్న సమయంలో 7.8 శాతం వృద్ధి రేట్ మన దేశం సాధించడంలో ప్రధాని నరేంద్ర మోదీ జీ సార్థ్యంలోని కేంద్ర ప్రభుత్వం కృషి ప్రజలు గుర్తించారు.

రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిర్వహించిన విశాఖ సిఐఐ సదస్సులో 138 ఒప్పందాలతో 9 లక్షల కోట్ల పెట్టుబడుల లక్ష్యంగా 3.50 లక్షల ఉద్యోగ కల్పన కోసం అడుగులు పడిన అంశాన్ని ప్రజలు సానుకూల దృక్కోణంలో చూస్తున్నారు.


కేవలం ఎన్నికల విజయాలే కాదు… ప్రజల సంక్షేమం … దేశ ప్రగతి కూటమి ప్రాధాన్యం.

Post a Comment

0 Comments