విశాఖపట్నం: ప్రపంచ డయాబెటిస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని నవంబర్ 14 న విశాఖపట్నం డిఎంహెచ్ఓ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా.పి.జగదీశ్వరరావు గారు, ప్రోగ్రాం ఆఫీసర్ (NCD) డా. హారిక గారు మరియు ఇతర ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కార్యాలయంలోని అందరికీ షుగర్ పరీక్షలు మరియు అధికరక్తపోటు పరీక్షలు నిర్వహించబడినాయి. డయాబెటిస్ అవగాహన, ప్రాముఖ్యత, నివారణ మరియు జీవనశైలిలో మార్పులు తదితర అంశాలపై సిబ్బందికి అవగాహన కల్పించబడింది.
డయాబెటిస్ మెలిటస్ లక్షణాలు:
- తరచుగా మూత్ర విసర్జన
- కీటోన్యూరియా (మూత్రంలో కీటోన్ పదార్థాల ఉనికితో)
- మానసిక స్థితిలో మార్పు
- కళ్ల దృష్టిలో మార్పు
- బరువు తగ్గడం
- బలహీనతగా ఉండటం
- ఎక్కువగా దాహం కలగడం
- చెడ్డ నెమలిగిన నయం అవ్వకపోవడం
ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సలహా తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ప్రజలు తమ ఆరోగ్యంపై దృష్టి పెట్టి సరైన పరీక్షలు చేయించుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి డిఎంహెచ్ఓ కార్యాలయం ధన్యవాదాలు తెలుపుతున్నది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి,
విశాఖపట్నం

0 Comments