ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఆనంద్ కుమార్ పింగళి గారు (ప్రిన్సిపాల్, ఏఎస్ఆర్ హోమియోపతి మెడికల్ కళాశాల, తాడేపల్లిగూడెం) పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ ఆనంద్ కుమార్ పింగళి గారు మాట్లాడుతూ, గ్రంథాలయ ఉద్యమకారుల కృషి ఫలితంగానే నేడు మనకు గ్రంథాలయాలు ఏర్పడ్డాయని, వారి సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. జీవితంలో నిర్దేశించుకున్న గమ్యాన్ని చేరుకోవడానికి నిత్యం పుస్తక పఠనం ఎంతో దోహదపడుతుందని తెలిపారు. నిరంతర పఠనం ద్వారా జ్ఞానాన్ని పెంపొందించుకోవడంతో పాటు జీవితంలో ఉన్నత లక్ష్యాలను చేరుకోవచ్చని వివరించారు. ఈ సందర్భంగా తాబేలు, కుందేలు కథను గుర్తుచేస్తూ, నిరంతర ప్రయత్నం, పట్టుదల యొక్క ప్రాముఖ్యతను వివరించారు.
భాను నెక్స్ట్జెన్ గ్లోబల్ స్కూల్ ప్రిన్సిపాల్ కర్రి వంశీకృష్ణ గారు మాట్లాడుతూ, “గ్రంథాలయం శాశ్వతం” అని పేర్కొన్నారు. బిందెలోని నీటిని ఎంత ఉపయోగిస్తే అంత తగ్గిపోతుందని, కానీ పుస్తకంలోని జ్ఞానం మాత్రం ఎంత చదివినా తరగదని చక్కని ఉదాహరణతో వివరించారు.
సూర్యదీప్ పాఠశాల గణిత ఉపాధ్యాయులు ఫిలిప్ రాజ్ కుమార్ గారు మాట్లాడుతూ, విద్యార్థులు మొదట వార్తాపత్రికల పఠనంతో ప్రారంభించి క్రమంగా పుస్తకాలు చదవడాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. ఈ గ్రంథాలయంలో సభ్యత్వం లేకపోయినా వార్తాపత్రికలు చదువుకునే అవకాశం ఉందని, ఈ సదుపాయాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థులకు ప్రోత్సాహం అందించారు. కార్యక్రమం ముగింపులో శ్రీ జి.ఎస్.కె. మాధవ్, శ్రీమతి మాధవి గార్లు విద్యార్థులకు బిస్కెట్లు పంపిణీ చేశారు.





0 Comments