ఘనంగా జరిగిన ఆర్యవైశ్య యువజన సంఘం 54వ వార్షికోత్సవం

 


విశాఖపట్నం :ఆర్యవైశ్య యువజన సంఘం 54వ వార్షికోత్సవం ఆదివారం నాడు విశాఖపట్నం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్కన గల వాసవి భవన్ లో ఘనంగా  నిర్వహించారు. 1973 లో స్థాపించబడిన ఆర్యవైశ్య యువజన సంఘం 54 సంవత్సరములు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన వార్షికోత్సవ సభలో ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు శ్రీ కొల్లూరు సూర్యారావు  సంఘం ఆవిర్భావం గురించి మాట్లాడుతూ 1973వ సంవత్సరంలో విశాఖ నగరంలో ఆనాటి ఆర్యవైశ్య ప్రముఖులు స్వర్గీయ పెనుగొండ వెంకట్రావు, తాటికొండ గవరరాజు, కందుల రామారావు, వబ్బిలి శెట్టి వరహాలు శెట్టి తదితరులు నగరంలోని ఆర్యవైశ్యులందరూ ఒక్కత్రాటిపై ఉండాలని,  ఆర్యవైశ్య పేదలకు ఆర్థిక సహాయం అందించాలని, పేద ఆర్యవైశ్య విద్యార్థులకు స్కాలర్షిప్ అందించి వారి ఉన్నతికి సహాయపడాలని, మహిళలకు ఆర్థిక స్వావలంబన చేకూర్చే ధ్యేయంతో కుట్టు అల్లికలు వంటి కళలలో శిక్షణ ఇప్పించి వారి ఆర్థిక స్థితి మెరుగుపరిచేటట్లు చేయాలని, సమాజ సేవ చేయాలని, ఆర్యవైశ్యుల సంస్కృతి సాంప్రదాయాలను ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో వివిధ కార్యక్రమాల నిర్వహించడం వంటి సదుద్దేశంతో కందుల రామారావు గారి సారధ్యంలో ప్రారంభించబడిన సంఘం దినదిన ప్రవర్ధమానముగా ఎదుగుతూ  53 సంవత్సరములు పూర్తి చేసుకుందని అన్నారు.

కార్యదర్శి శ్రీ యలమర్తి గణేష్ మాట్లాడుతూ  గత సంవత్సర కాలంలో గిరి ప్రదక్షిణ మరియు జగన్నాథ రథాయాత్ర  సందర్బంగా భక్తులకు ప్రసాద వితరణ, శ్రావణమాసంలో మహిళా కార్యక్రమాలు, వైకుంఠ ఏకాదశి నాడు సత్యనారాయణ స్వామి వ్రతములు, పిక్నిక్ మరియు ఆర్యవైశ్య వధూవరుల పరిచయ సభ, వంటి కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించామని అన్నారు.

 ముఖ్య హాతిదిగా విచ్చేసిన బి.ఎస్.కే. రాజ్ కుమార్, IRSE ప్రిన్సిపాల్ ఛీఫ్ ఇంజనీర్, సౌత్ కోస్ట్ రైల్వే, విశాఖపట్నం మాట్లాడుతూ 53 సంవత్సరాల క్రితం ఆనాటి పెద్దలు ముందుచూపుతో ఏర్పాటు చేసిన ఆర్యవైశ్య యువజన సంఘం దినదిన ప్రవర్ధమానమై ఎదుగుతూ సంఘం యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళుతూ ఎంతో మంది నిరుపేద  విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందించి వారి ఉన్నత చదువులకు చేయూతనివ్వడం, పేద ఆర్యవైశ్య కుటుంబాలకు సహాయం అందించటం, మహిళలకు ఆర్థిక స్వావలంబన చేకూరు విధంగా పాటుపడటం ముదావహం అని అన్నారు.   

గౌరవ అతిధి శ్రీమతి మాటూరి మంగతాయార్,  డిస్ట్రిక్ట్ గవర్నర్, లయన్స్ ఇంటర్నేషనల్ మాట్లాడుతూ 53 సంవత్సరాలుగా ఆర్యవైశ్యుల పట్ల, సమాజం పట్ల అంకిత భావంతో, నిస్వార్ధ సేవ చేయటం ఇతర సంస్థలకు ఆదర్శంగా నిలుస్తుంధన్నారు. 

ఈ సందర్భంగా పువ్వాడ శోభన్ ప్రకాష్ , డిస్ట్రిక్ట్ గవర్నర్, రోటరీ క్లబ్, కంకటాల సతీష్, అంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు, మరియు వంకాయల జవహర్, రక్తదానం విషయంలో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ గ్రహీత లను ఘనంగా సత్కరించారు.

ప్రోగ్రాం చైర్మెన్ శ్రీ వెదుళ్ళపల్లి శ్రీనివాస రావుమాట్లాడుతూ సంఘ అభివృద్ధికి, సంఘ ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విషయంలో బాధ్యత వహించి పాటుపడిన మాజీ అధ్యక్ష, కార్యదర్శులు చేపట్టిన కార్యక్రమాలను విజయవంతం చేయుటలో వారు చేసిన కృషి శ్లాఘనీయమన్నారు. కార్యక్రమానికి హాజరైన పూర్వపు అధ్యక్ష కార్యదర్శులను ఘనంగా సత్కరించారు.  54వ వార్షికోత్సవం సందర్భంగా   పురుషులకు, మహిళలకు, పిల్లలకు వేరువేరుగా  నిర్వహించిన వివిధ రకాల ఆటల పోటీలలో గెలుపొందిన వారికి ముఖ్యఅతిథి చేతుల మీదుగా బహుమతి ప్రధానం చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు నాట్య ప్రదర్శనలు  అలరించాయి.

కార్యక్రమంలో ఆర్యవైశ్య యువజన సంఘం కోశాధికారి కొత్తా అరుణ్ కుమార్, బోడా సురేష్,  పెన్నం వంశీ, పూసర్ల సంజీవిరావు, కన్యకా పరమేశ్వర దేవస్థాన సంఘ అధ్యక్షులు  ఆరిశెట్టి దినకర్,  కనకమహాలక్ష్మి దేవస్థానం మాజీ అధ్యక్షులు విన్నకోట రామమూర్తి వాసవి కళ్యాణ మండపం సంఘం  కార్యదర్శి నున్న గోపాల్,  కే.ఎమ్.వి. రామకృష్ణ,  పట్నాల వెంకట రెడ్డి, దుర్గా సోమేశ్వరరావు, మరియు నగరంలోని ఆర్యవైశ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Post a Comment

0 Comments