*ముఖ్యమంత్రి దృష్టికి జర్నలిస్టుల సమస్యలు* *ఇళ్ల స్థలాలు, పింఛన్ల సాధనకు రాష్ట్రస్థాయిలో కృషి* *పెండింగ్ సమస్యల పరిష్కారానికి చంద్రబాబును మరోసారి కలవాలని నిర్ణయం* *డిసెంబర్ 6న విశాఖ జిల్లా వర్కింగ్ జర్నలిస్టుల వనభోజన మహోత్సవం* *జాతీయ జర్నలిస్టు ల సంఘం కార్యదర్శి గంట్ల


అక్కయ్యపాలెం..*విశాఖపట్నం: నవంబర్ 18 రాష్ట్రంలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు గంట్ల శ్రీనుబాబు, విశాఖ జిల్లా అధ్యక్షులు పి. నారాయణ, జిల్లా కార్యదర్శి జి. శ్రీనివాసరావు తెలిపారు.

బుధవారం అక్కయ్యపాలెం జంక్షన్‌లోని ఓ ప్రైవేట్ హోటల్‌లో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, బ్రాడ్‌కాస్ట్, స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ ల సంయుక్త కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై విస్తృతంగా చర్చించి పలు తీర్మానాలు చేశారు.


జర్నలిస్టుల చిరకాల స్వప్నమైన ఇళ్ల స్థలాలు, గృహాల కేటాయింపునకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న తరహాలో ఆంధ్రప్రదేశ్‌లోనూ అర్హులైన జర్నలిస్టులకు పింఛన్ విధానాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ రెండు ప్రధాన సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర కార్యవర్గం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నట్లు వెల్లడించారు.

ఈ అంశాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి మరోసారి తీసుకెళ్లి, జర్నలిస్టులకు న్యాయం జరిగేలా ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం, భద్రత, ఆర్థిక భరోసాకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

### డిసెంబర్ 6న జర్నలిస్టుల వనభోజన మహోత్సవం

కార్తీక మాసాన్ని పురస్కరించుకుని డిసెంబర్ 6న ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ విశాఖ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జర్నలిస్టుల వనభోజన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు గంట్ల శ్రీనుబాబు, పి. నారాయణ, జి. శ్రీనివాసరావు ప్రకటించారు.


ప్రతి ఏడాది సంప్రదాయంగా నిర్వహిస్తున్న ఈ వేడుకను ఈసారి కూడా జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యుల మధ్య ఆత్మీయ సమ్మేళనంగా మధురవాడ జాతర ప్రాంతంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 6న ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ సాంస్కృతిక, వినోద కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.

జర్నలిస్టుల మధ్య ఐక్యత, స్నేహభావం, కుటుంబాల మధ్య ఆత్మీయ అనుబంధాలను మరింత బలోపేతం చేయడమే ఈ వనభోజన మహోత్సవం ప్రధాన ఉద్దేశమని వారు వివరించారు.

ఈ సమావేశంలోకార్యదర్శి జి. శ్రీనివాస్ రావు డిప్యూటీ జనరల్ సెక్రెటరీ ఏ.సాంబశివరావు ఆర్గనైజింగ్ సెక్రెటరీ డి రవికుమార్. ఉపాధ్యక్షులు ఎన్. రామకృష్ణ ఏపీ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ అధ్యక్షులు ఇరోతి ఈశ్వరరావు కార్యదర్శి కింతాడ మదన్ ఉపాధ్యక్షులు దేవ త్రినాథ్ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్మోహన్ కార్యదర్శి శ్రీనివాస్ కోశాధికారి కె.వి శర్మ ఇతర సభ్యులు జగన్, బొబ్బర ప్రసాద్ ఫెడరేషన్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బి .ఆనంద్  సంయుక్త కార్యదర్శి రాజశేఖర్, కార్యవర్గ సభ్యులు కిషోర్,. రెడ్డి,తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments