సింహాచలం :తేదీ: 20-11-2026 ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానానికి విశాఖపట్నం గాజువాక, కు చెందిన భక్తురాలు శ్రీమతి ఎస్. లక్ష్మీ దుర్గేశ్వరి విలువైన బంగారు కానుకను సమర్పించారు.
శుక్రవారం ఆలయానికి విచ్చేసిన దాత, మొత్తం 71 గ్రాముల బరువు గల లాకెట్లతో కూడిన 3 బంగారు చైన్లను (వరుసగా 26 గ్రాములు, 24 గ్రాములు, 21 గ్రాములు) స్వామివారికి కానుకగా అందజేశారు.
ఈ బంగారు ఆభరణాలను ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ జల్లేపల్లి వెంకట్రావు కి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీమతి సింగం రాధ కి మరియు సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ పిల్లా శ్రీనివాసరావు కి దాత స్వయంగా అందజేశారు.
అనంతరం దాతకు ఆలయ అధికారులు స్వామివారి ప్రత్యేక దర్శనం కల్పించారు. దర్శనానంతరం వేద పండితులు దాతకు వేద ఆశీర్వచనం అందజేయగా, అధికారులు శేష వస్త్రంతో సత్కరించి స్వామివారి ప్రసాదాలను అందజేశారు.

0 Comments