కొత్తపేట ;విశాఖ సందేశం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట పంచాయతీ అభ్యర్థిగా గుత్తుల శ్రీనివాసు శుక్రవారం నామినేషన్ వేశారు. కొత్తపేట అభివృద్ధే ప్రధాన అజెండాగా ముందుకు వచ్చిన తనను గెలిపించాలని కొత్తపేట సర్పంచ్ అభ్యర్థి గుత్తుల శ్రీనివాసు (వాసు) కోరారు.ఈ సందర్భంగా వాసు మాట్లాడుతూ జిల్లా వైసీపీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి, స్థానిక నాయకుల ప్రోత్సాహంతో తాను నామినేషన్ వేశానన్నారు.

కొత్తపేట పంచాయతీ గత 15 సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోలేదన్నారు. తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేవని చెప్పారు. తన తండ్రి స్వర్గీయ గుత్తుల వెంకటరత్నం గతంలో కొత్తపేట సొసైటీ ప్రథమ ప్రెసిడెంట్ గా చేశారన్నారు. సుమారు పది సంవత్సరాల పాటు నిస్వార్ధంగా పనిచేసి తన పదవికి న్యాయం చేశారన్నారు. ఈ విషయం కొత్తపేట ప్రజలందరికీ తెలుసు అని, ఆయనను స్ఫూర్తిగా తీసుకొని తాను ఇప్పుడు బరిలోకి వచ్చాను అని తెలియజేశారు. తనకు ఓట్లు వేసి సర్పంచిగా గెలిపిస్తే కొత్తపేటను అభివృద్ధి బాటలో నడిపిస్తానన్నారు. రోడ్లు, డ్రైనేజీలతో పాటు తాగునీటి వ్యవస్థను డెవలప్ చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు గొల్లపల్లి డేవిడ్రాజు, ముత్యాల వీరభద్రరావు, గూడపాటి రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
0 Comments