ప్రొమెనేడ్ జాతికి అంకితం


విశాఖపట్నం: నవంబరు 11కేంద్ర ఓడరేవులు, నౌకాయాన, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ బుధవారం విశాఖపట్నం పోర్ట్ అథారిటీలో పలు కీలక అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ సమీపంలో నిర్మించిన పోర్ట్ ప్రొమెనేడు ప్రజలకు అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే ఉన్న మురుగునీటి శుద్ధి కేంద్రం సామర్థ్యాన్ని 10 ఎంఎల్ డీ నుంచి 15 ఎంఎల్ కి పెంచడం, కొత్తగా 5 ఎంఎల్ సామర్థ్యంతో మరో ఎన్టీపీ ఏర్పాటు చేయడం, అలాగే ఐదు బెర్త్ నిర్వహణ, కార్యకలాపాలను పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ విధానంలో ప్రైవేట్ సంస్థలకు అప్పగించే కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం లోకసభ సభ్యులు మతుకుమిల్లి శ్రీభరత్, రాజ్యసభ సభ్యులు గొల్ల బాబూరావు, విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, విశాఖ ఉత్తర ఎమ్మెల్యే పి. విష్ణుకుమార్ రాజు, విశాఖపట్నం పోర్ట్ అథారిటీ చైర్మన్ జస్మీత్ సింగ్ బింద్రా, డిప్యూటీ చైర్పర్సన్ రోప్ని ఎ. కొరటి, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ అరుణ్ ప్రసాద్ , తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ సమీపంలో విశాఖపట్నం పోర్ట్ అథారిటీ అభివృద్ధి చేసిన పోర్ట్ ప్రొమెనేడు కేంద్ర మంత్రి ప్రజలకు అంకితం చేశారు. సముద్ర తీర ప్రాంతంలో 'ఆహ్లాదకరమైన ఆహ్లాదకర వాతావరణంలో వడక సాగించడంతో పాటు నౌకల రాకపోకలు, నౌకాశ్రయ కార్యకలాపాలను సురక్షితమైన ప్రదేశం నుంచి వీక్షించేలా ఈ ప్రొమెనేడ్ను రూపొందించారు. ఈ ప్రాంగణంలో చిన్నారుల కోసం ప్రత్యేక ఆట స్థలం, ఫుడ్ కోర్టు, సందర్శకుల వాహనాల పార్కింగ్ సదుపాయాలను ఏర్పాటు చేశారు. దీంతో కుటుంబ సభ్యులు, పర్యాటకులు, సందర్శకులకు ఇది ఒక ఆకర్షణీయమైన వినోద కేంద్రంగా మారనుంది. పర్యావరణ పరిరక్షణ, మురుగునీటి శుద్ధి సామర్థ్యాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో విశాఖపట్నం పోర్టులో ప్రస్తుతం ఉన్న 10 ఎంఎల్డీ సామర్థ్యం గల మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని 15 ఎంఎల్ కి అప్గ్రేడ్ చేయడంతో పాటు కొత్తగా 5 ఎంఎల్డీ సామర్థ్యంతో మరో ఎన్టీపీని ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.11.86 కోట్లు, విజయవాడకు చెందిన మెస్సర్స్ వెల్కో ఇన్ఫ్రాటెక్ ప్రాజెక్ట్స్ (ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు పనులు అప్పగించారు. కార్లో నిర్వహణ సామర్థ్యం, పోర్టు కార్యకలాపాల సామర్థ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో విశాఖపట్నం పోర్ట్ ఆధారటీ ఖరు బెర్త నిర్వహణ, కార్యకలాపాలను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో ప్రైవేట్ సంస్థలకు అప్పగించింది. ఐదు బెర్త్తో అదనంగా 11 మిలియన్ టన్నుల కార్గో సామర్థ్యం పోర్టు పెంపొందించుకుంది. ప్రైవేట్ రంగ భాగస్వామ్యంతో పోర్టు మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం,

విద్యార్థులకు వైద్య పరీక్షలు

కార్యకలాపాల్లో సామర్థ్యాన్ని పెంచడం, కార్గో నిర్వహణ వేగవంతం చేయడం, అంతర్జాతీయ మారిటైమ్ రంగంలో విశాఖపట్నం పోర్లు పోటీతత్వాన్ని మరింత పెంపొందించరం జరుగుతుంది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ మాట్లాడుతూ, పోర్ట్ ప్రొమెనేడ్ ద్వారా పోర్టును నగర ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు పర్యాటక, వినోద సదుపాయాలను ప్రోత్సహించేందుకు అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. క్రూయిజ్ టూరిజం, పోర్టు ఆధారిత అభివృద్ధికి ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని తెలిపారు. ఎన్టీపీ సామర్థ్యాన్ని 10 ఎంఎల్డీ నుంచి 15 ఎంఎల్డీకి పెంచడం పర్యావరణ పరిరక్షణకు, హరిత్ సాగర్ గ్రీన్ పోర్ట్ లక్ష్యాల సాధనకు దోహదపడుతుందని పేర్కొన్నారు విశాఖపట్నం పోర్టు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న చైర్పర్సన్, ఉన్నతాధికారులు, అధికారులు, ఉద్యోగులను మంత్రి అభినందించారు. పోర్టు వాటాదారులతో కేంద్ర మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు అనంతరం కేంద్ర మంత్రి పోర్టు అధికారులతో పాటు స్టీవేర్లు కార్మిక సంఘాల ప్రతినిధులు, పీపీపీ ఆపరేటర్లు, ఇతర పోర్టు వాటాదారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పోర్టు కార్యకలాపాలు, కార్గో నిర్వహణ, వాటాదారుల సమస్యలు, పోర్టు సామర్థాన్ని మరింత మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.



Post a Comment

0 Comments