భారతీయ విద్యా కేంద్రం ఆధ్వర్యములో అనుబంధ సంస్థ అయిన "శ్రీ టి.వి.యస్.రావు శ్రీకృష్ణా విద్యామందిర్‌లో " 15/11/26 అనగా రవివారం తొమ్మిది గంటలకు,
ఋషి పీఠం మరియు భారతీయ విద్యా కేంద్రం వారి సారథ్యంలో హనుమాన్ చాలిసా 108 సార్లు పఠనం శాంతియుతముగా, ఎంతో భక్తి పారవశ్యముతో నిర్వహించడం జరిగింది విద్యాభారతి, భారతీయ విద్యా కేంద్రం చైర్మన్ ప్రముఖులు ఆచార్య గొల్లప్రోలు నాగేశ్వరరావుగారు,విద్యా భారతి దక్షిణ మధ్య క్షేత్ర కార్యదర్శి శ్రీ అయాచితుల లక్ష్మణరావు జ్యోతి ప్రజ్వలనతో ఈ భక్తి, కార్యక్రమానికి నాంది పలికారు.
భారతీయ విద్యా కేంద్ర కార్యదర్శి శ్రీ వేదనభట్ల రామ సత్యనారాయణ, ప్రముఖులైన ఎ.వి.యస్.ఆచార్యులు , శ్రీ వై.శ్రీధర్, శ్రీమతి అరుణ గాయత్రి గారు, ఉషశ్రీ గారు,ఉడా చైర్మన్ ప్రణమ్ గోపాల్, హనుమాన్ శక్తి హోమం లో పాల్గొన్నారు.పాఠశాల ప్రధానాచార్య చిరంజీవి, కరస్పాండెంట్ శ్రీ సుబ్బారావు పాల్గొన్నారు.బారతీయ విద్యా కేంద్రం పాఠశాలలు, కళాశాలలు విద్యార్థులు, ఆచార్యులు, కేంద్ర కార్యాలయ సిబ్బంది 2000మంది హనుమాన్ చాలీసా పారాయణములో పాల్గొన్నారు.
హనుమాన్ చాలీసా పారాయణము ఎంతో భక్తి భావనతో ఈ కార్యక్రమాన్ని ప్రసాద్ వితరణతో జయప్రదం చేశారు.
Pro Bvk College
M. Deva Trinadh Rao




0 Comments