విశాఖపట్నం, 14 నవంబర్ 2026:దక్షిణ తీర రైల్వే, విశాఖపట్నం డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ శ్రీ లలిత్ బోహ్రా, సింహాచలం రైల్వే స్టేషన్‌ను తనిఖీ చేసి, అక్కడ జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు.
తనిఖీ సందర్భంగా, డీఆర్ఎం పనుల స్థితిని పరిశీలించి, వాటి పురోగతి గురించి సంబంధిత అధికారులతో మాట్లాడారు. స్టేషన్ మౌలిక సదుపాయాలు మరియు ప్రయాణీకుల సౌకర్యాలను మెరుగుపరచడానికి చేపడుతున్న అభివృద్ధి కార్యకలాపాలను ఆయన సమీక్షించారు.
తనిఖీ సమయంలో డీఆర్ఎంతో పాటు వాణిజ్య మరియు ఇంజనీరింగ్ విభాగాల అధికారులు కూడా ఉన్నారు



0 Comments